Klin Kaara First Birthday : క్లిన్ కారా ఫస్ట్ బర్త్ డే.. ఇవాళ అయినా మెగా లిటిల్ ప్రిన్సెస్ ఫేస్ చూపిస్తారా..?

క్లిన్ కారా పూర్తి ఫేస్ ఎప్పుడు చూపిస్తారా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Klin Kaara First Birthday : క్లిన్ కారా ఫస్ట్ బర్త్ డే.. ఇవాళ అయినా మెగా లిటిల్ ప్రిన్సెస్ ఫేస్ చూపిస్తారా..?

Klin Kaara First Birthday Mega Fans Waiting for Klin Kaara Full Face Reveal

Klin Kaara First Birthday : రామ్ చరణ్ – ఉపాసనలకు కూతురు పుట్టినప్పటి నుంచి మెగా ఫ్యామిలీ ఫుల్ సంతోషంలో ఉంది. ఈ మెగా లిటిల్ ప్రిన్సెస్ పుట్టినప్పటి నుంచి వైరల్ అవుతూనే ఉంది. క్లిన్ కారాగా పేరు పెట్టినప్పటి నుంచి ఈ పేరు కూడా వైరల్ అవుతుంది. అయితే ఇప్పటికే అనేక సార్లు క్లిన్ కారా ఫొటోలు బయటకు వచ్చాయి.

ఉపాసన లేదా రామ్ చరణ్, మెగా ఫ్యామిలీలో ఎవరో ఒకరు క్లిన్ కారాను ఎత్తుకున్నప్పటి ఫొటోలు బయటకు వచ్చాయి. కానీ ఇప్పటివరకు కూడా క్లిన్ కారా ఫేస్ చూపించలేదు. దీంతో మెగా అభిమానులు నిరాశ చెందుతున్నారు. మా లిటిల్ ప్రిన్సెస్ ఫేస్ ని చూపించండి అంటూ అడుగుతున్నారు. క్లిన్ కారా పూర్తి ఫేస్ ఎప్పుడు చూపిస్తారా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Also Read : Klin Kaara : క్లిన్ కారా ఫస్ట్ బర్త్ డే.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఉపాసన.. ఏడ్చేసిన చరణ్, ఉపాసన..

నేడు జూన్ 20 క్లిన్ కారా మొదటి పుట్టిన రోజు. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి. మెగా ఫ్యామిలీలో గ్రాండ్ గా క్లిన్ కారా మొదటి పుట్టినరోజు వేడుకలు జరపనున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఉపాసన క్లిన్ కారా గురించి ఓ ఎమోషనల్ వీడియో కూడా షేర్ చేసింది. దీంతో క్లిన్ కారా ఫేస్ ఇవాళ అయినా పూర్తిగా చూపిస్తారా? బర్త్ డే ఫొటోలు బయటకు రిలీజ్ చేస్తారా? అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇవాళ మెగా లిటిల్ ప్రిన్సెస్ ఫస్ట్ బర్త్ డేని ఏ రేంజ్ లో చేస్తారో? ఫొటోస్ బయటకు విడుదల చేస్తారా? క్లిన్ కారా ఫేస్ చూపిస్తారా? చూడాలి.

Klin Kaara First Birthday Mega Fans Waiting for Klin Kaara Full Face Reveal