Klin Kaara : క్లిన్ కారా ఫస్ట్ బర్త్ డే.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఉపాసన.. ఏడ్చేసిన చరణ్, ఉపాసన..
నేడు క్లిన్ కారా పుట్టి సంవత్సరం అయినందనుకు ఫస్ట్ బర్త్ డే సందర్భంగా ఉపాసన తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది.

Klin Kaara First Birthday Upasana Shares Emotional Video of Ram Charan and Mega Family
Klin Kaara Konidela : రామ్ చరణ్(Ram Charan), ఉపాసన(Upasana)ల కూతురు క్లిన్ కారా పుట్టి సంవత్సరం అయిపోయింది. గత సంవత్సరం జూన్ 20న మెగా ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చింది. క్లిన్ కారా రాకతో మెగా ఇంట సంబరాలు నెలకొన్నాయి. మెగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఇక క్లిన్ కారా పుట్టిన తర్వాత రామ్ చరణ్ కు మరింత నేషనల్ వైడ్ స్టార్ డమ్ రావడం, చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడం, వరుణ్ తేజ్ పెళ్లవ్వడం.. ఇలా మెగా ఫ్యామిలీకి కలిసి వస్తుండటంతో క్లిన్ కారా పుట్టాకే మెగా ఫ్యామిలీ మరింత సంతోషంగా ఉందని కూడా పలువురు భావిస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు క్లిన్ కారా ఫేస్ పూర్తిగా ఒక్కసారి కూడా చూపించలేదు. పలుమార్లు క్లిన్ కారా ఫొటోలు బయటకు వచ్చిన ప్రతిసారి ఫేస్ కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. తాజాగా నేడు క్లిన్ కారా పుట్టి సంవత్సరం అయినందనుకు ఫస్ట్ బర్త్ డే సందర్భంగా ఉపాసన తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది.
Also Read : Deepika Padukone : ప్రభాస్ పెట్టే ఫుడ్ పై దీపికా కామెంట్స్.. కేటరింగ్ సర్వీస్ లాగా చాలా ఫుడ్..
ఈ వీడియోలో.. చరణ్, ఉపాసన ఇద్దరూ కూడా ఉపాసన ప్రగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి బేబీ పుట్టేంతవరకు ఎలా ఫీల్ అయ్యారో చెప్తూ ఎమోషనల్ అయ్యారు. తమని అందరూ పిల్లల గురించి అడిగేవాళ్ళని, పెళ్లయిన పదకొండేళ్ల తర్వాత పాప పుట్టడం అందరికి హ్యాపీగా ఉందని, తనని ఫస్ట్ టైం ఎత్తుకున్నప్పుడు మర్చిపోలేనని, తను పుట్టినప్పుడు అభిమానులు అందరూ సెలబ్రేట్ చేసుకున్నారని చెప్తూ ఏడ్చేశారు చరణ్, ఉపాసన. అలాగే ఉపాసన ప్రగ్నెన్సీ నుంచి పాప పుట్టి బారసాల అయి పేరు అనౌన్స్ చేసే వరకు విజువల్స్ గా చూపించారు. దీంతో ఉపాసన షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.