Deepika Padukone : ప్రభాస్ పెట్టే ఫుడ్ పై దీపికా కామెంట్స్.. కేటరింగ్ సర్వీస్ లాగా చాలా ఫుడ్..

తాజాగా ముంబైలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్లో దీపికా పదుకోన్ కూడా ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి మాట్లాడింది.

Deepika Padukone : ప్రభాస్ పెట్టే ఫుడ్ పై దీపికా కామెంట్స్.. కేటరింగ్ సర్వీస్ లాగా చాలా ఫుడ్..

Deepika Padukone Comments on Prabhas Home Food

Updated On : June 20, 2024 / 7:00 AM IST

Deepika Padukone : ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి అందరికి తెలిసిందే. సినిమా సెట్స్ లో హీరోయిన్స్ కి, ఆర్టిస్టులకు ప్రభాస్ అప్పుడప్పుడు ఇంటినుంచి పలు రకాల ఫుడ్ తెప్పించి మరీ పెడతాడు. ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి అందరూ మాట్లాడతారు. ప్రభాస్ ఫుడ్ తో చేసే మర్యాదకు హీరోయిన్స్ ఆశ్చర్యపోతారు. ఇప్పటిదాకా ప్రభాస్ తో పని చేసిన ప్రతి హీరోయిన్ ప్రభాస్ పెట్టిన ఫుడ్ గురించి మాట్లాడిన వాళ్ళే. ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తారు పలువురు ఆర్టిస్టులు.

తాజాగా ముంబైలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్లో దీపికా పదుకోన్ కూడా ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి మాట్లాడింది. ఆల్రెడీ గతంలో దీపికా కల్కి షూటింగ్ సమయంలో ప్రభాస్ ఇంటి నుంచి తెప్పించిన ఫుడ్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Also Read : Kalki 2898AD Pre Release Event : ప్రభాస్ కల్కి 2898 AD ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..

తాజాగా ప్రభాస్ ఫుడ్ గురించి దీపికా మరోసారి మాట్లాడుతూ.. ప్రభాస్ పెట్టిన ఫుడ్ వల్ల ఇప్పుడున్న బేబీ బంప్ లాగా కనిపించేది. షూటింగ్ లో ప్రతిరోజు ఫుడ్ తెప్పించేవాడు. కేటరింగ్ సర్వీస్ లాగా చాలా ఐటమ్స్ తెప్పించేవాడు. తన మనసుతో అందరికి భోజనం పెడతాడు అని కామెంట్స్ చేసింది. దీంతో మరోసారి ప్రభాస్ ఫుడ్ వైరల్ అవుతుంది. ఇక అభిమానులు, నెటిజన్లు.. ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి తెలిసిందేగా, మర్యాదలతో ఇబ్బంది పెట్టేస్తాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.