Mega Family
Mega Family : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా ఇటీవల థియేటర్స్ లో రిలీజయి పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు 270 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది. OG సినిమాకు ప్రీమియర్స్ రోజునే సినీ పరిశ్రమ సెలబ్రిటీలు అంతా థియేటర్స్ కి వెళ్లి సినిమాని చూసారు. మెగా ఫ్యామిలిలో కూడా చిరు, చరణ్ తప్ప ఆల్మోస్ట్ అందరూ ప్రీమియర్స్ కి వెళ్లి చూశారు.(Mega Family)
పవన్ పిల్లలు అకిరా నందన్, ఆద్య కూడా OG రిలీజ్ కి థియేటర్స్ లో హంగామా చేసిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే నిన్న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో మెగా ఫ్యామిలీకి స్పెషల్ గా OG షో వేశారు. ఈ షోకి ఆల్మోస్ట్ మెగా ఫ్యామిలీ అంతా హాజరయ్యారు. చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, అకిరా నందన్, ఆద్య, సుస్మిత కొణిదెల, సుస్మిత పిల్లలు, మరికొంతమంది మెగా కజిన్స్ హాజరయ్యారు.
అంతే కాకుండా OG మూవీ టీమ్ నిర్మాత దానయ్య, తమన్, శ్రియ రెడ్డి, ఎడిటర్ నవీన్ నూలి, సుజీత్, ఆర్ట్ డైరెక్టర్ AS ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ రవి చంద్రన్.. పలువురు టీమ్ మెంబర్స్, అలాగే అడివి శేష్, రాహుల్ రవీంద్రన్.. పలువురు హాజరయ్యారు.
అయితే చాన్నాళ్ల తర్వాత అకిరా నందన్, ఆద్య కలిసి మళ్ళీ నాన్న పవన్ కళ్యాణ్ తో కనిపించారు. అకిరా ఇటీవల పవన్ కళ్యాణ్ తో కలిసి తమిళనాడు టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు చివరగా కనిపించాడు. ఆద్య మాత్రం పవన్ ఎన్నికల్లో గెలిచినప్పుడు కలిసి కనిపించింది. మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత ఆద్య, అకిరా ఇద్దరూ నాన్నతో కలిసి కనిపించడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక మెగా కజిన్స్ అందరూ హాజరవడంతో మెగా ఫ్యామిలీ హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో ఉండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Dhanush : వరుస హిట్స్ ఇస్తున్నాం.. అయినా తెలుగుని పట్టించుకోని ధనుష్..