Trump Effect : ట్రంప్ టారిఫ్ దెబ్బ.. అమెరికాలో సినిమా టికెట్ రేట్లు ఎంత పెరగనున్నాయి.. టాలీవుడ్ పై ఎఫెక్ట్ ఎంత?

ఇప్పుడు ట్రంప్ వేసిన వంద శాతం పన్నులతో ఇకపై కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుందని అంచనా వేస్తున్నారు. (Trump Effect)

Trump Effect : ట్రంప్ టారిఫ్ దెబ్బ.. అమెరికాలో సినిమా టికెట్ రేట్లు ఎంత పెరగనున్నాయి.. టాలీవుడ్ పై ఎఫెక్ట్ ఎంత?

Trump Effect

Updated On : September 30, 2025 / 3:33 PM IST

Trump Effect : తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై వంద శాతం పన్నులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికాలో రిలీజయ్యే వేరే దేశాల సినిమాలకు భారీగా ఎఫెక్ట్ అవ్వనుంది. మన టాలీవుడ్ కి కూడా కష్టమే. సాధారణంగానే మన టాలీవుడ్ సినిమాలకు అమెరికాలో మంచి మార్కెట్ ఉంది, భారీ కలెక్షన్స్ వస్తాయి.(Trump Effect)

ఇప్పుడు ట్రంప్ వేసిన వంద శాతం పన్నులతో ఇకపై కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల రిలీజయిన OG సినిమా 5 మిలియన్ డాలర్స్ కి పైగా అయిదు రోజుల్లోనే అమెరికా నుంచి కలెక్ట్ చేసింది. అంటే ఆల్మోస్ట్ 42 కోట్ల పైనే. ఇప్పుడు ఆ టారిఫ్ లతో ఈ రేంజ్ కలెక్షన్స్ కి గండి పడుతుంది.

Also Read : Dhanush : వరుస హిట్స్ ఇస్తున్నాం.. అయినా తెలుగుని పట్టించుకోని ధనుష్..

ఉదాహరణకు అమెరికాలో మన తెలుగు సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేసే డిస్ట్రిబ్యూటర్ ఒక సినిమాని ఒక మిలియన్ డాలర్స్ కి కొంటే ఇంకో మిలియన్ డాలర్స్ అమెరికాకు పన్ను చెల్లించాల్సిందే. దీంతో ఆటోమేటిక్ గా అక్కడ టికెట్ రేట్లు పెరుగుతాయి.

ప్రస్తుతం అమెరికాలో తెలుగు సినిమాలకు టికెట్ రేట్లు 10, 14, 20 డాలర్లు ఉన్నాయి. ఈ టారిఫ్ తో 10 డాలర్ల టికెట్ రేటు 20 డాలర్లు అవుతుంది. 20 డాలర్ల టికెట్ రేటు 40 డాలర్లు అవుతుంది. ఇక అమెరికాలో రాష్ట్రాలకు సపరేట్ పన్నుల విధానం కూడా ఉండటంతో కొన్ని చోట్ల ఆ టికెట్ రేటు 30 డాలర్ల నుంచి 50 డాలర్ల వరకు కూడా అవ్వొచ్చు.

Also Read : Mahakali: అసురగురు శుక్రాచార్య.. మహాకాళి సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా?

ఈ టికెట్ రేటు మాములు థియేటర్స్ లోనే. ఖరీదైన మల్టీప్లెక్స్, ఐమాక్స్ లాంటి థియేటర్స్ లో టికెట్ రేట్లు ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. దీంతో ఇప్పుడు థియేటర్స్ కి వస్తున్నట్టు అప్పుడు కూడా తెలుగు వాళ్ళు అమెరికాలో సినిమాలకు ఎగబడతారా అనేది అనుమానమే. అక్కడ సెటిల్ అయిన వాళ్ళు తప్ప అక్కడ చదువుకోడానికి వెళ్లి, పార్ట్ టైం చేస్తూ బతుకుతున్న వాళ్ళు మాత్రం ఇంత రేటు పెట్టి మన తెలుగు సినిమాలను చూడటం కష్టమే అని అంచనా వేస్తున్నారు. మరి ఈ వంద శాతం టారిఫ్ లు ఇలాగే ఉంటాయా? తగ్గుతాయా? తర్వాత ఏదైనా సవరణలు చేస్తారా చూడాలి.