×
Ad

OG Special Show: ఓజీ సినిమా చూసిన మెగా ఫ్యామిలీ.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.. వీడియో వైరల్

మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే మూమెంట్ వచ్చింది. మెగా ఫ్యామిలీ(OG Special Show) అంతా కలిసి ఓజీ సినిమా చూశారు. పవన్ కళ్యాణ్ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ ఓజీ సినిమాను వీక్షించారు.

Mega family watched Pawan Kalyan's OG movie special show

OG Special Show: మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే మూమెంట్ వచ్చింది. మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఓజీ సినిమా చూశారు. ఈ స్పెషల్ షో కి మెగా మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, సురేఖ, రామ్ చరణ్, సాయి దుర్గ తేజ్, అకిరా, ఆధ్య హాజరయ్యారు. ఓజీ సినిమాను వీక్షించారు. దీనికి సంబదించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు(OG Special Show). ఒకే చోట అందరు కలవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

OG Tickets Issue: టికెట్స్ రేట్స్ వెంటనే తగ్గించండి.. లేదంటే కఠిన చర్యలు.. తెలంగాణ పోలీస్ శాఖ హెచ్చరిక

ఇక ఓజీ సినిమా విషయానికి వస్తే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను దర్శకుడు సుజీత్ తెరకెక్కించాడు. గ్యాంగ్ స్టార్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఫుల్లుగా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ నుంచి చాలా కాలం తరువాత వచ్చిన యాక్షన్ సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. దీంతో, బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతోంది ఈ సినిమా. మొదటి రోజు రూ.154 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రూ.252 కోట్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.