Ram Charan : రామ్ చరణ్ కూతురి ‘క్లీంకార’పై సాంగ్ రిలీజ్.. అభిమానులు చేసిన ఆ పాట విన్నారా..

పుట్టినరోజు సందర్భంగా చిరు, పవన్, రామ్ చరణ్ పై ఎలా అయితే పాటలని రూపొందిస్తారో. ఇప్పుడు క్లీంకార పై కూడా అలాగే ఓ సాంగ్ ని రూపొందించారు.

Mega fans made song on Ram Charan Upasana daughter Klin Kaara

Ram Charan : రామ్ చరణ్, ఉపాసన దాదాపు 11 ఏళ్ళ తరువాత తల్లిదండ్రులు అయ్యారు. మెగా ఇంటికి మహాలక్ష్మిని తీసుకు వస్తూ ‘క్లీంకార’కి ఆహ్వానం పలికారు. మెగా వారసురాలి రాకతో కొణిదెల ఇంటిలో సంబరాలు అంబరాన్ని అంటాయి. మెగా అభిమానుల్లో కూడా ఎంతో సంతోషం వచ్చింది. రామ్ చరణ్ వారసత్వం కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కోసం క్లీంకార తన రూపంతో ఎంతో ఆనందాన్ని తీసుకు వచ్చింది.

దీంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా క్లీంకార రాక పై ప్రతి ఒక్కరు ఎంతో పొంగిపోతున్నారు. ఈ సంతోషంతోనే క్లీంకార పై ఓ పాటని తీసుకు వచ్చారు. పుట్టినరోజు సందర్భంగా చిరు, పవన్, రామ్ చరణ్ పై ఎలా అయితే పాటలని రూపొందిస్తారో. ఇప్పుడు క్లీంకార పై కూడా అలాగే ఓ సాంగ్ ని రూపొందించారు. ఈ పాటని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు. ఉపాసన చేతులు మీదుగా ఈ పాటని విడుదల చేశారు. మరి ఆ పాటని మీరుకూడా వినేయండి.

Also read : Mega156 : మెగా156 టైటిల్ టీజర్ వచ్చేసింది.. గ్రాఫిక్స్ మాత్రం అదిరిపోయాయి..

కాగా గతంలో కీరవాణి తనయుడు కాలభైరవ కూడా క్లీంకార కోసం ఓ ప్రత్యేక ట్యూన్ చేసి ఇచ్చారు. ఇప్పుడు అభిమానులు ఇలా ఓ సాంగ్ ని తీసుకు వచ్చారు. అయితే మెగా కపుల్ ఇప్పటివరకు క్లీంకార ఫేస్ ని రివీల్ చేయలేదు. క్లీంకార మొఖం చూపించకుండానే మెగా అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంటుంది. మరి మెగా కపుల్ క్లీంకార ఫేస్ ని ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి.

ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అంతా సంక్రాంతి సెలబ్రేషన్స్ లో ఉన్నారు. బెంగళూరు ఫార్మ్ హౌస్ లో ఈ పండగ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్ కి మెగా, అల్లు హీరోలు హాజరయ్యి సందడి చేస్తున్నారు. నేడు అక్కడి నుంచి ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఫొటోని కూడా అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలో పవన్ కళ్యాణ్ మాత్రమే మిస్ అయ్యారు. అయితే పవన్ కి బదులుగా ఆయన వారసులు అకిరా నందన్, ఆద్య పాల్గొన్నారు.