Mega156 : మెగా156 టైటిల్ టీజర్ వచ్చేసింది.. గ్రాఫిక్స్ మాత్రం అదిరిపోయాయి..
మెగా156 టైటిల్ అనౌన్స్ చేస్తూ కాన్సెప్ట్ టీజర్ ని రిలీజ్ చేశారు.

Chiranjeevi Mega156 VISHWAMBHARA title teaser released
Mega156 : బింబిసారా దర్శకుడు వశిష్ఠతో మెగాస్టార్ చిరంజీవి తన 156 సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. సంక్రాంతి తరువాత నుంచి చిరంజీవి ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నారు. కాగా ఈ మూవీ టైటిల్ ని సంక్రాంతి పండుగ కానుకగా ప్రకటిస్తామంటూ తెలియజేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు గతంలోనే ఓ వార్త బయటకి వచ్చింది. ఇప్పుడు ఆ టైటిల్ నే ఖరారు చేశారు. ‘విశ్వంభర’ అనే టైటిల్ ని అనౌన్స్ చేస్తూ.. సినిమా కాన్సెప్ట్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాని దాదాపు 75 శాతం VFX పైనే తెరకెక్కించబోతున్నట్లు మూవీ టీం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన కాన్సెప్ట్ టీజర్ లో గ్రాఫిక్స్ చూస్తుంటే వావ్ అనిపిస్తున్నాయి.
Also read : Telugu Movies : నెట్‌ఫ్లిక్స్ సినిమా పండుగ.. ఆ తెలుగు చిత్రాలన్నీ ఆ ఓటీటీలోనే..
టీజర్ లోనే ఇలా ఉంటే, సినిమాలో ఇంకే రేంజ్ లో ఉండబోతున్నాయో అని ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. టీజర్ లో ఏదో ఓ ముఖ్యం వస్తువు వేరే యూనివర్స్ నుంచి భూమి మీదకి వచ్చి పడినట్లు చూపించారు. ఆ వస్తువు చుట్టూనే సినిమా కథ అంతా నడవబోతుందని తెలుస్తుంది. ఇక ఈ టైటిల్ టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించేశారు. 2025 సంక్రాంతికి ఈ సినిమాని తీసుకు వస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని చిరంజీవి కెరీర్ లోనే హై బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో నటించబోయే ఇతర కాస్టింగ్ వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో రానా దగ్గుబాటి విలన్ గా, త్రిష ఫిమేల్ లీడ్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ కాస్టింగ్ వివరాలు పై కూడా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందట.