Telugu Movies : నెట్‌ఫ్లిక్స్ సినిమా పండుగ.. ఆ తెలుగు చిత్రాలన్నీ ఆ ఓటీటీలోనే..

నెట్‌ఫ్లిక్స్ సినిమా పండుగ అంటూ తమ ఓటీటీలో రిలీజ్ కాబోయే కొత్త చిత్రాల అప్డేట్స్ ని ప్రకటించింది.

Telugu Movies : నెట్‌ఫ్లిక్స్ సినిమా పండుగ.. ఆ తెలుగు చిత్రాలన్నీ ఆ ఓటీటీలోనే..

Netflix announce new Telugu Movies releases in their ott 2024

Updated On : January 15, 2024 / 4:57 PM IST

Telugu Movies : తెలుగు ఆడియన్స్‌కి సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. ఇంటి వద్ద పండగ సెలబ్రేట్ చేసుకొని, థియేటర్స్ కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక ఈ ఓటీటీ కల్చర్ వచ్చిన తరువాత సంక్రాంతి పద్దతిని ఆ సంస్థలు కూడా పాటిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సినిమా పండుగ అంటూ.. తమ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న తెలుగు సినిమాలు ఏంటో ప్రకటించింది.

థియేటర్ లో రిలీజైన సినిమాలు, ఇంకా షూటింగ్ జరుపుకుంటున్న మూవీల ఓటీటీ అప్డేట్స్ ని నెట్‌ఫ్లిక్స్ తెలియజేసింది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ మోస్ట్ హైపెడ్ మూవీ ‘సలార్’ థియేటర్స్ లో రిలీజయ్యి భారీ కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాని ఓటీటీలో మరోసారి చూసేందుకు ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ ఓటీటీ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

Also read : Guntur Kaaram : గుంటూరు కారం టీం సైబర్ క్రైమ్‌ కేసు నమోదు.. ఎందుకో తెలుసా..?

ఇక షూటింగ్ దశలో ఉన్న ఎన్టీఆర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘దేవర’ మూవీ ఓటీటీ రైట్స్ ని కూడా నెట్‌ఫ్లిక్సే సొంతం చేసుకుంది. సౌత్ లోని నాలుగు లాంగ్వేజ్స్ తో పాటు హిందీ లాంగ్వేజ్ రైట్స్ కూడా నెట్‌ఫ్లిక్సే తీసుకుంది. అలాగే పాన్ ఇండియా ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘పుష్ప 2’ కూడా నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమ్ కాబోతుంది. ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ ఓటీటీ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

బాలయ్య, దర్శకుడి బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK109 చిత్రం యొక్క సౌత్ ఆల్ లాంగ్వేజ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ VD12 కూడా నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమ్ కాబోతుంది. ఇక సిద్దు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’, బొమ్మరిల్లు భాస్కర్ తో తెరకెక్కిస్తున్న ‘SVCC37’ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.

అలాగే విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, అల్లు శిరీష్ ‘బడ్డీ’, హీరో కార్తికేయ కొత్త మూవీ, ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ కొత్త చిత్రం కూడా నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమ్ కాబోతుంది. సంక్రాంతి సందర్భంగా ఒకే రోజు ఇన్ని చిత్రాల ఓటీటీ అప్డేట్స్ ని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.