Guntur Kaaram : సైబర్ క్రైమ్‌‌కి గుంటూరు కారం టీం పిర్యాదు.. ఎందుకో తెలుసా..?

సైబర్ క్రైమ్‌‌లో గుంటూరు కారం టీం కేసు నమోదు చేసింది. అసలు ఏమైంది..? ఎవరు మీద కేసు నమోదు చేశారు..?

Guntur Kaaram : సైబర్ క్రైమ్‌‌కి గుంటూరు కారం టీం పిర్యాదు.. ఎందుకో తెలుసా..?

Mahesh Babu Guntur Kaaram movie team file a case in cyber crime

Guntur Kaaram : త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’.. ఈ సంక్రాంతి కానుకగా రిలీజయ్యి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం పై రూపొందిన ఈ రీజినల్ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ నమోదు చేస్తుంది. ఇది ఇలా ఉంటే, ఈ సినిమాపై కొందరు కావాలనే నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తూ.. మూవీ పై నెగటివిటీని వ్యాప్తి చేస్తున్నారంటూ నిర్మాతలు పేర్కొన్నారు.

ప్రముఖ టికెట్ బుకింగ్ సైట్ ‘బుక్ మై షో’లో గుంటూరు కారం మూవీకి నెగటివ్ ఓటింగ్స్ ఇస్తున్నారట. దాదాపు 70 వేలకు పైగా ఫేక్ బోట్స్ ద్వారా ఓట్లు వేసి మూవీ 0/1 రేటింగ్ వచ్చేలా టార్గెట్ చేస్తూ సినిమాకి నష్టం కలిగేలా ప్రవర్తిస్తున్నారట. ఇక ఈ విషయం పై మూవీ టీం సీరియస్ అయ్యింది. ఇలా చేస్తున్నవారి చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ని గుంటూరు కారం టీం ఆశ్రయించిందట.

Also read : Mega Sankranti : మెగా సంక్రాంతి పిక్ వచ్చేసింది.. ఫొటోలో ఇది గమనించారా..

ఫేక్ బోట్స్ ద్వారా ఫేక్ ఓట్లు వేస్తూ నెగటివిటీ వ్యాప్తి చేస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మూవీ టీం సైబర్ క్రైమ్ లో కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఇంత నెగటివిటీలో కూడా ఈ చిత్రం అదిరిపోయే కలెక్షన్స్ ని అందుకుంటుంది. మొదటి రోజే ఈ చిత్రం 94 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టి రీజినల్ సినిమాల్లో రికార్డు సృష్టించింది.

ఇక రెండో రోజు దాదాపు 37 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని రూ.127 కోట్లతో వంద కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. మొదటి వీకెండ్ పూర్తీ అయ్యేపాటికీ రూ.164 కోట్ల గ్రాస్ ని నమోదు చేసింది. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 130 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. దీనిబట్టి చూస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 270 కోట్ల పైగా కలెక్షన్స్ ని రాబట్టాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ బట్టి చూస్తే.. మరో 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకోవాలి.