మెగా హీరోలంతా ఒకే ఫ్రేములో.. వాళ్లిద్దరు మిస్సింగ్!

  • Published By: vamsi ,Published On : January 15, 2020 / 06:30 AM IST
మెగా హీరోలంతా ఒకే ఫ్రేములో.. వాళ్లిద్దరు మిస్సింగ్!

Updated On : January 15, 2020 / 6:30 AM IST

ఎపుడు సినిమాలతో బిజీగా ఉండే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. మెగా హీరోలు అందరితో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రమ్‌లో పంచుకున్నారు. ఇపుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రామ్ చరణ్ షేర్ చేసిన ఫోటోలో మెగా ఫ్యామిలీ మెంబర్స్‌ను చూసి మెగాభిమానుల ఆనంద పడుతున్నారు.

సంక్రాంతి సంధర్భంగా.. ఇవాళ(15 జనవరి 2020) హ్యాపీ సంక్రాంతి అంటూ.. ఫోటో షేర్ చేసుకున్నారు రామ్ చరణ్. ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి పంచెకట్టులో ఉండగా.. రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌, పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్, అల్లూ శిరీష్, మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్, వైష్ణవ్ తేజ్ ఇందులో ఉన్నారు. ఇందులో పవన్ కళ్యాణ్, నాగబాబు మాత్రం మిస్ అయ్యారు. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.

మెగా ఫ్యామిలీలో ఒక క్రొకెట్ టీమ్‌కి సరిపడినంతమంది హీరోలు ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో ఈ ఫోటోపై కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌లు హీరోలుగా ఉండగా.. నాగబాబు ప్రత్యేక పాత్రల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నారు. కళ్యాణ్ దేవ్ ఇటీవలే విజేత సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. త్వరలోనే సాయి ధరమ్ తేజ్ తమ్ముడు.. వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అకీరా నందన్ కూడా ఇప్పటికే ఒక సినిమాలో నటించాడు.

ప్రస్తుతం ఈ హీరోలంతా వారి వారి సినిమాల్లో బిజీగా ఉన్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Happy Sankranti !!!

A post shared by Ram Charan (@alwaysramcharan) on