మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కి హెచ్‌బీఓ ఇండియా స్పెషల్ సర్ప్రైజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అభిరుచికి తగ్గ బహుమతులు పంపిన HBO INDIA..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అభిరుచికి తగ్గ బహుమతులు పంపిన HBO INDIA..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కి సూపర్ మేన్ బొమ్మలన్నా, మాస్కులు అన్నా చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. సూపర్ హీరోల సినిమాలను వరుణ్ ఒక్కటి కూడా వదలకుండా చూస్తుంటాడు. అది గుర్తించే HBO INDIA వరుణ్ తేజ్‌కి ఇష్టమైన డీసీ కామిక్ బొమ్మలను బహుమతిగా ప్రెజెంట్ చేసింది.
బాట్ మ్యాన్ మాస్క్, వండర్ వుమెన్ మాస్క్‌లతో పాటు ఓ కారు బొమ్మను కూడా ఈ సంస్థ వరుణ్‌కి పంపించింది. ఈ విషయాన్ని వరుణ్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్‌లో షేర్ చేస్తూ హెబీఓ ఇండియాకు కృతజ్ఞతలు తెలిపాడు.
ఇక ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ‘గద్దలకొండ గణేష్’ వంటి సూపర్ హిట్‌ను అందుకొని అదే ఉత్సాహంతో ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. సిద్ధు ముద్దా, అల్లు వెంకటేష్ నిర్మాతలుగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. థమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది.