Hari Hara Veera Mallu : చిరంజీవి చేతుల మీదుగా హరిహర వీరమల్లు ట్రైలర్!

హరిహర వీరమల్లు ట్రైలర్‌ రిలీజ్ ప్రొగ్రామ్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ వస్తారని టాక్ వినిపిస్తోంది.

mega star chiranjeevi as a chief in hari hara veera mallu trailer event

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పవన్‌ షెడ్యూల్ బిజీగా ఉండటంతో షూటింగ్ లేటుగా కొనసాగడంతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్‌గా జులై 24న హరిహర వీరమల్లు మూవీ పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు హరిహర వీరమల్లు ట్రైలర్‌ రిలీజ్ ప్రొగ్రామ్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ వస్తారని టాక్ వినిపిస్తోంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ చిత్రంలో వీరమల్లు అనే ధీరోదాత్తమైన యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎం.ఎం. కీరవాణి సంగీతం, 17వ శతాబ్దపు మొగల్ నేపథ్యంలో అద్భుతమైన విజువల్స్ ఉంటాయని టాక్. అయితే ట్రైలర్ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి పాల్గొంటే ఈ సినిమాకు మెగా బూస్ట్ వస్తుందని, అభిమానులకు డబుల్ ట్రీట్ అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Thammudu : నితిన్ ‘తమ్ముడు’ రిలీజ్‌ ట్రైలర్ వచ్చేసింది..

ఈ భారీ పీరియాడిక్ డ్రామాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ డైరెక్షన్‌ చేస్తున్నారు. బాబీ డియోల్ మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రలో, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, సత్యరాజ్ వంటి తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ట్రైలర్ లాంచ్‌కు చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వస్తే సినిమాకు ఇంకా హైప్ రావడం పక్కా అంటున్నారు.

ఈ సినిమా రిలీజ్‌ గతంలో పలుసార్లు వాయిదా పడటంతో..జూలై 3న నిర్వహించే ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేసి అభిమానుల్లో కొత్త జోష్ నింపాలని నిర్మాతలు భావిస్తున్నారట. అందుకే చిరంజీవిని చీఫ్‌ గెస్ట్‌గా వస్తారని న్యూస్ వైరల్ అవుతోంది. ఈ గాసిప్ నిజమైతే, చిరంజీవి సమక్షంలో జరిగే ఈ ట్రైలర్ లాంచ్ హరిహర వీరమల్లుకు భారీ బజ్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. హరిహర వీరమల్లు ఈవెంట్‌కు చిరు వస్తారా లేక పవన్ చేతుల మీదే ట్రైలర్ లాంచ్ చేస్తారా అనేది చూడాలి మరి.