Chiranjeevi : చిరంజీవి న్యూ ఫిల్మ్ టైటిల్ ఇదే

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా నూతన చిత్రం టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఆయనకు ఇది 154వ చిత్రం. మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమెక్ కు సంబంధించిన అప్ డేట్ ప్రకటించారు.

Bhola

Chiranjeevi 154 Movie Title : మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా నూతన చిత్రం టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఆయనకు ఇది 154వ చిత్రం. ఇప్పటికే ‘ఆచార్య’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అనంతరం ‘లూసిఫర్’ చిత్రంలో నటించనున్నారు మెగాస్టార్. తాజాగా..మరో దర్శకుడి చిత్రానికి ఒకే చెప్పారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమెక్ కు సంబంధించిన అప్ డేట్ ప్రకటించారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ జరుగనుంది.

Read More : Taliban Fatwa on Co-education: అన్నీ చెడ్డ పనులకు మూలం కో ఎడ్యుకేషన్ – తాలిబాన్లు

2021, ఆగస్టు 22వ తేదీ చిరంజీవి జన్మదిన సందర్భంగా…చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్ ను సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆవిష్కరించారు. సినిమాకు ‘భోళా శంకర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ మూవీని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. తమిళ వెర్షన్ వేదాళం మూవీలో అజిత్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. తెలుగు రీమెక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తారని ప్రచారం జరిగింది. తాజాగా..మెగాస్టార్ చిరంజీవి ఈ రీమెక్ చేయబోతున్నారు.

Read More : Petrol Rate : గుడ్ న్యూస్.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఇందులో చిరు విభిన్నంగా కనిపించనున్నారని తెలుస్తోంది. చిరంజీవికి సోదరిగా కీర్తి సురేశ్ నటించనున్నారని టాక్. మొత్తానికి చిరు జన్మదినం సందర్భంగా…న్యూ మూవీకి సంబంధించిన అప్ డేట్ రావడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.