Petrol Rate : గుడ్ న్యూస్.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

మూడు నెలల తర్వాత పెట్రోల్ రేటు స్వల్పంగా తగ్గింది. ఇక గడిచిన ఐదు రోజుల్లో నాలుగుసార్లు డీజిల్ రేటు తగ్గింది

Petrol Rate : గుడ్ న్యూస్.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Rate (2)

Petrol Rate : మూడు నెలల తర్వాత దేశంలో పెట్రోల్ ధర మొదటి సారి తగ్గింది. రూ.80 నుంచి పరుగులు పెడుతూ రూ.100 దాటిన పెట్రోల్ ధర.. ఆదివారం 20 పైసలు తగ్గింది. రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 20 పైసల మేరకు తగ్గింది. అదేవిధంగా డీజిల్ కూడా 20 పైసల మేరకు తగ్గింది. ఈ తగ్గింపు అనంతరం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 101.64గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.89.07గా ఉంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ పై 14పైసలు తగ్గి రూ.105.69కి చేరింది. డీజిల్ పై 18 పైసలు తగ్గి రూ.97.15 కు చేరింది. గడిచిన ఐదు రోజుల్లో నాలుగు సార్లు డీజిల్ రేట్లు తగ్గగా.. గడిచిన మూడు నెలల్లో ఒకసారి పెట్రోల్ ధర తగ్గింది.

ముంబై- పెట్రోల్ రూ. 107.66, డీజిల్ రూ .96.64
చెన్నై- పెట్రోల్ రూ .99.32, డీజిల్ రూ. 93.66
కోల్‌కతా- పెట్రోల్ రూ. 101.93, డీజిల్ రూ. 92.13
జైపూర్- పెట్రోల్ రూ. 108.56, డీజిల్ లీటరుకు రూ. 98.22
భోపాల్- పెట్రోల్ రూ .110.06, డీజిల్ రూ. 97.88