రాననుకున్నావా.. రాలేననుకున్నావా? ‘ఈసారి హగ్ చేసుకున్నప్పుడు చెప్తా..

సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబుల మధ్య సరదా సంభాషణ..

  • Published By: sekhar ,Published On : March 26, 2020 / 11:59 AM IST
రాననుకున్నావా.. రాలేననుకున్నావా? ‘ఈసారి హగ్ చేసుకున్నప్పుడు చెప్తా..

Updated On : March 26, 2020 / 11:59 AM IST

సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబుల మధ్య సరదా సంభాషణ..

మెగాస్టార్ చిరంజీవి, మార్చి 25న ఉగాది పర్వదినం సందర్భంగా పలు సోషల్ మీడియా మాద్యమాల్లోకి అఫీషియల్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఎంట్రీ పై పలువురు ప్రేక్షకులు, మెగా ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుండగా, కొందరు సినిమా ప్రముఖులు ఆయనను సోషల్ మీడియాలోకి సాదరంగా స్వాగతం పలుకుతూ తమ అకౌంట్స్ ద్వారా అభినందనలు తెలుపుతున్నారు.

అందులో భాగంగా కలెక్షన్ కింగ్ నటప్రపూర్ణ మోహన్ బాబు, ట్విట్టర్‌కి స్వాగతం మిత్రమా అంటూ మెగాస్టార్‌ను ఉద్దేశించి ట్వీట్ చేయగా, ‘రాననుకున్నావా, రాలేననుకున్నావా’ అంటూ సరదాగా మోహన్ బాబు ట్వీట్‌ని మెగాస్టార్ రీట్వీట్ చేశారు. దానికి సమాధానంగా మోహన్ బాబు, ‘ఈసారి హగ్ చేసుకున్నప్పుడు చెప్తాను’ అని రిప్లై ఇచ్చారు.

మొదటి నుండి టాలీవుడ్‌లో ఈ ఇద్దరు అగ్రనటుల మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం చిరంజీవి చేసిన ఆ ఫన్నీ ట్వీట్ పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ట్విట్టర్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ చిరు ఖాతా తెరిచారు.