Ram Charan – Chiranjeevi : గ్రాండ్‌గా డైరెక్టర్ శంకర్ కూతురు రిసెప్షన్.. హాజరైన మెగాస్టార్, గేమ్ ఛేంజర్.. మరింతమంది సినీ ప్రముఖులు..

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యామిలీతో శంకర్ కూతురి పెళ్ళి రిసెప్షన్ కి హాజరవ్వడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

Ram Charan – Chiranjeevi : తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్(Director Shankar) కూతురు ఐశ్వర్య శంకర్‌ వివాహం నిన్న ఘనంగా జరిగింది. డైరెక్టర్ శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన తరుణ్ కార్తికేయన్ తో ఐశ్వర్య వివాహం జరిగింది. ఫిబ్రవరిలో వీరి నిశ్చితార్థం జరగగా నిన్న ఏప్రిల్ 15న వివాహం జరిగింది. ఈ వివాహానికి తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్, రజినీకాంత్, కార్తీ, సూర్య, మణిరత్నం, విక్రమ్, నయనతార, కమల్ హాసన్.. లతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు..

తాజాగా నేడు ఉదయం చెన్నైలో ఈ జంట వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీ నిర్వహించగా ఈ పార్టీకి కూడా అనేకమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, ఉపాసన, మెగాస్టార్ చిరంజీవి కూడా సతీమణితో హాజరయ్యారు. బోనికపూర్, జాన్వీ కపూర్, విజయ్ సేతుపతి, అల్లు అరవింద్, రకుల్ ప్రీత్, శృతిహాసన్.. మరికొంతమంది సినీ ప్రముఖులు ఐశ్వర్య – తరుణ్ రిసెప్షన్ కి హాజరయ్యారు.

Also Read : Avantika Vandanapu : హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న అవంతిక వందనపు..

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యామిలీతో శంకర్ కూతురి పెళ్ళి రిసెప్షన్ కి హాజరవ్వడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ఇక రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. గేమ్ ఛేంజర్ సినిమా కోసం మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు