Chiranjeevi : అమెరికాలో మెగాస్టార్, వెంకీమామ.. ఒకే పెళ్ళిలో సందడి చేస్తూ..

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అలాగే అక్కడ ఓ పెళ్ళికి కూడా హాజరయ్యారు. ఆ పెళ్ళికి వెంకీమామ కూడా హాజరవ్వటం విశేషం.

Chiranjeevi – Venkatesh : మెగాస్టార్ చిరంజీవి ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. తన భార్య సురేఖతో కలిసి వాలెంటైన్స్ డే రోజు అమెరికా వెళ్లారు చిరంజీవి. పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపికైనందుకు అమెరికాలో మెగాస్టార్ కి అక్కడి తెలుగు వారు సన్మానం చేయనున్నారు. అలాగే అక్కడ ఓ పెళ్ళికి కూడా హాజరయ్యారు. ఆ పెళ్ళికి వెంకీమామ కూడా హాజరవ్వటం విశేషం.

తాజాగా చిరంజీవి అమెరికాలో(America) ఓ పెళ్ళికి వెళ్లి అక్కడ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నా ఫ్రెండ్ కుమార్ కోనేరు తనయుడు కిరణ్ కోనేరు వివాహానికి హాజరయ్యాం. కొత్త జంటని ఆశీర్వదించాం. ఈ హ్యాపీనెస్ లో వెంకటేష్ కూడా తోడయ్యాడు అని ట్వీట్ చేసారు.

Also Read : Rakul Preet Singh : పెళ్లి పనులు మొదలుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్

అమెరికాలో నివసిస్తున్న కుమార్ కోనేరు తనయుడి పెళ్ళికి చిరంజీవి, సురేఖలతో పాటు వెంకటేష్, అల్లు అరవింద్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత TG విశ్వప్రసాద్.. మరికొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. దీంతో చిరు షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు