Megastar Chiranjeevi : అనిల్ రావిపూడితో చిరంజీవి మూవీ ఫిక్స్‌.. ఏ జాన‌రో తెలుసా?

టాలీవుడ్‌ హీరోలు ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యే మూవీస్‌ ప్లాన్ చేసుకుంటున్నారు.

Megastar chiranjeevi Anil ravipudi movie fix

యాక్షన్, క్రైమ్‌ థ్రిల్లర్..రొమాంటిక్‌, అడ్వెంచర్. జానర్‌ ఏదైనా సబ్జెక్ట్‌ ఇంపార్టెంట్. మిగతా ఏ జానర్స్‌తో పోల్చినా ఈ మధ్య ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీస్‌ సక్సెస్‌ రేటే ఎక్కువగా ఉంది. దీంతో టాలీవుడ్‌ హీరోలు ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యే మూవీస్‌ ప్లాన్ చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ క్యూలోనే ఉన్నారు. కామెడీ విత్ యాక్షన్ డ్రామా మూవీస్‌కు ప్లాన్ చేసుకుంటున్నారు చిరు.

మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఇప్పుడు రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి శ్రీకాంత్ ఓదెల, ఇంకోటి అనిల్ రావిపూడి సినిమా. అంటే అవి చిరు 157,158 సినిమాలు. ఇప్పటి వరకు చిరు 157వ సినిమా శ్రీకాంత్ ఓదెలతోనే అనుకున్నారు. కానీ చిరంజీవి మాత్రం 157వ మూవీగా అనిల్ రావిపూడి సినిమా చేయడానికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట.

Brahma Anandam trailer: ‘బ్రహ్మా ఆనందం’ మూవీ ట్రైలర్‌ విడుదల.. అదిరిపోయిందంతే..

ఈ సినిమా స్టోరీ, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చకాచకా అయిపోతుందట. అనిల్ రావిపూడితో సినిమా ఇంకా అఫిసియల్‌గా ఎనౌన్స్‌మెంట్‌ చేయలేదు చిరు. కానీ శ్రీకాంత్‌తో చేసే మూవీపై అఫీషియల్‌ ప్రకటన ఇచ్చేశారు.

Viswak Sen: సారీ సార్.. అంటూ హీరో విశ్వక్‌ సేన్ ఆవేదనాభరిత కామెంట్స్‌.. దయచేసి బలి చేయొద్దంటూ..

అయినా అనిల్ రావిపూడి సినిమానే ఫస్ట్ చేయడానికి..అది పుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌ సబ్జెక్ట్ కావడమే కారణమట. విశ్వంభర మే 9న రిలీజ్ అనుకుంటున్నారు. ఒకవైపు ప్రమోషన్స్..మరోవైపు అనిల్‌తో సినిమా చేయడానికి చిరు బిజీ అయిపోతునున్నాడట. దీంతో శ్రీకాంత్, చిరు సినిమాకు టైమ్ పట్టే అవకాశం ఉందంటున్నారు. చిరు ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించబోతుండటంతో అప్పుడే సినిమాపై బజ్ క్రియేట్ అవుతూనే ఉంది. బాస్ కామెడీ టైమింగ్‌ వేరే అని కామెంట్స్ పెడుతున్నారు మెగా ఫ్యాన్స్.