Brahma Anandam trailer: ‘బ్రహ్మా ఆనందం’ మూవీ ట్రైలర్ విడుదల.. అదిరిపోయిందంతే..
ఈ సినిమాలో బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ నటిస్తున్నారు.

‘బ్రహ్మా ఆనందం’ సినిమా ట్రైలర్‌ను ఇవాళ హీరో ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ నటిస్తున్నారు. వారిద్దరు ఈ సినిమాలో తాత-మనవళ్లుగా నటిస్తుండడం గమనార్హం.
ట్రైలర్‌లో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్ మధ్య డైలాగులు అదుర్స్ అనిపిస్తున్నాయి. ఈ ట్రైలర్‌లో హాస్యంతో పాటు భావోద్వేగాలను చూపించారు. బ్రాహ్మనందం, రాజా గౌతమ్ పోషించిన పాత్రల మధ్య ఉన్న ప్రేమను ఈ ట్రైలర్ హైలైట్ చేస్తుంది.
ఈ సినిమాలో ప్రియ వడ్లమాని, వెన్నెల కిశోర్, ఐశ్వర్య హోలక్కల్, తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్.వి.ఎస్.నిఖిల్ దర్శకత్వం ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, రాహుల్ యాదవ్ నక్కా ఈ మూవీని నిర్మించారు.ఈ నెల 14న ఈ మూవీని విడుదల చేయనున్నారు. ఈ సినిమా టీమ్‌కి ప్రభాస్ శుభాకాంక్షలు చెప్పాడు.
తాత (బ్రహ్మానందం) ఆస్తిని పొందేందుకు సినిమాలో ఆయన మనవడు (రాజా) ఏం చేశాడన్న అంశంపై ఈ సినిమా తీశారు. పల్లెటూరి వాతావరణంలో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. అందుకు తగ్గట్లు సీన్లు ఉన్నాయని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.