Bhola Shankar : మెగాస్టార్ భోళా శంకర్ ఓటీటీ సెట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

భోళా శంకర్ సినిమా ఫలితంపై మెగా అభిమానులు కూడా నిరాశ చెందారు. సినిమా వచ్చి నెల రోజులు అవుతుండటంతో ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది.

Megastar Chiranjeevi Bhola Shankar Movie Streaming in Netflix OTT from September 15th

Bhola Shankar :  మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఇటీవల భోళా శంకర్(Bholaa Shankar) సినిమాతో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకి వచ్చారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ముఖ్య పాత్రలు పోషించారు. భోళా శంకర్ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఎన్నో అంచనాలతో వచ్చిన భోళా శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం పాలైంది. పెట్టిన బడ్జెట్ కూడా రాలేదని సమాచారం.

Prabhas : మంచు విష్ణు భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్.. ఆదిపురుష్ లో రాముడు కన్నప్పలో శివుడు..

భోళా శంకర్ సినిమా ఫలితంపై మెగా అభిమానులు కూడా నిరాశ చెందారు. సినిమా వచ్చి నెల రోజులు అవుతుండటంతో ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో భోళా శంకర్ సినిమా సెప్టెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా భోళా శంకర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. థియేటర్స్ లో బోల్తా పడిన భోళా ఓటీటీలో అయినా సక్సెస్ అవుతాడేమో చూడాలి.