Prabhas : మంచు విష్ణు భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్.. ఆదిపురుష్ లో రాముడు కన్నప్పలో శివుడు..

మంచు విష్ణు భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నది సమాచారం. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఉంటుందని టాక్ నడుస్తుంది.

Prabhas : మంచు విష్ణు భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్.. ఆదిపురుష్ లో రాముడు కన్నప్పలో శివుడు..

Prabhas playing Lord Shiva Role in Manchu Vishnu Bhaktha Kannappa Movie Breaking News goes Viral

Prabhas :  మంచు విష్ణు(Manchu Vishnu) గత ఏడాది ‘జిన్నా’(Jinna) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ తరువాత ఇటీవలే తన పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేశాడు విష్ణు. కృష్ణంరాజు(Krishnam Raju) హీరోగా తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ మూవీ ‘భక్త కన్నప్ప’(Bhakta Kannappa) చిత్రాన్ని ఆదర్శంగా తీసుకొని అది నా డ్రీం ప్రాజెక్టు అంటూ ‘కన్నప్ప’ అనే టైటిల్ తో సినిమాని అనౌన్స్ చేశాడు మంచు విష్ణు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. దాదాపు 150 కోట్లతో భారీగా ఈ సినిమాని మోహన్ బాబు (Mohan Babu) నిర్మించబోతున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణుకి జోడిగా బాలీవుడ్ భామ నుపుర్ సనన్ (Nupur Sanon) నటిస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమా విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. మంచు విష్ణు భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నది సమాచారం. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఉంటుందని టాక్ నడుస్తుంది. సినిమాలో భక్త కన్నప్పగా మంచు విష్ణు నటిస్తుండగా ప్రభాస్ శివుడి క్యారెక్టర్ చేస్తున్నట్టు సమాచారం.

Allu Arjun : మంచు విష్ణు గారు.. అంటూ అల్లు అర్జున్ ట్వీట్.. బన్నీకి స్పెషల్ లెటర్ రాసిన విష్ణు..

సోషల్ మీడియాలో ఓ సినిమా పీఆర్ దీని గురించి పోస్ట్ చేయగా మంచు విష్ణు ఆ ట్వీట్ షేర్ చేసి హరహర మహాదేవ్ అని రీ పోస్ట్ చేశాడు. దీంతో ఈ సినిమాలో ప్రభాస్ ఉండటం పక్కా, శివుడి పాత్ర పోషించబోతున్నాడు అని తెలుస్తుంది. దీంతో కొంతమంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుంటే, కొంతమంది మాతరం ప్రభాస్ గెస్ట్ రోల్, అది కూడా శివుడి రోల్, మంచు విష్ణు సినిమాలో అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ఆదిపురుష్ లో రాముడిగా మెప్పించిన ప్రభాస్ ఇప్పుడు కన్నప్పలో శివుడిగా మెప్పిస్తాడా చూడాలి.