చిరు స్టెప్స్.. గ్రేస్ ఏమాత్రం తగ్గలేదుగా!

మెగాస్టార్ చిరంజీవి బంగారుకోడిపెట్ట పాటకు ఖుష్బూ, జయప్రదలతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది..

  • Published By: sekhar ,Published On : November 30, 2019 / 04:50 AM IST
చిరు స్టెప్స్.. గ్రేస్ ఏమాత్రం తగ్గలేదుగా!

Updated On : November 30, 2019 / 4:50 AM IST

మెగాస్టార్ చిరంజీవి బంగారుకోడిపెట్ట పాటకు ఖుష్బూ, జయప్రదలతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది..

మెగాస్టార్ చిరంజీవి ఇంట తారల సందడి నెలకొంది. అలనాటి తారాగణమంతా కలిసి ఆట పాటలతో, విందు వినోదాలతో హంగామా చేశారు. ‘క్లాస్ఆఫ్ఎయిటీస్’… 1980 లో నటించిన స్టార్స్ తమ గ్రూప్‌కి పెట్టుకున్న పేరు ఇది. ప్రతి ఏడాది ఒక చోట కలుస్తూ రీ-యూనియన్ జరుపుకుంటూ ఉంటారు అప్పటి హీరో, హీరోయిన్లు.

Image result for 80s reunion

ఈ గ్రూప్‌లో మోహన్ లాల్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, జగపతి బాబు, వీకే నరేశ్, అర్జున్, జాకీ ష్రాఫ్, జయప్రద, రమ్యకృష్ణ, ప్రభు, సుమలత, శోభన, సుహాసిని, రాధిక, రేవతి, భాగ్యరాజ్, ఖుష్భూ, శరత్ కుమార్, సత్యరాజ్, జయరామ్, నదియా, సుమన్ తదితరులు ఉన్నారు. వీళ్లు కలిసిన ప్రతిసారి ఆ పార్టీకి ఓ డ్రెస్ కోడ్ ఏర్పాటు చేసుకుంటారు.

అలాగే ఒక్కో సంవత్సరం ఒక్కో చోట రీ-యూనియన్ ప్లాన్ చేస్తారు. ఈ సంవత్సరం ‘క్లాస్ఆఫ్ఎయిటీస్’ పదో యానివర్శరీ హైదరాబాద్‌లోని చిరంజీవి స్వగృహంలో ఘనంగా జరిగింది. దాదాపు 40 మంది స్టార్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సారి బ్లాక్ అండ్ గోల్డ్ డ్రెస్ కోడ్‌లో తారలంతా మెరిశారు.

ముద్దుగుమ్మతో చిరంజీవి చిందులు..

చిరంజీవి ఖుష్బూ, జయప్రదలతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ‘ఘరానామొగుడు’ సినిమాలో బంగారుకోడిపెట్ట పాటకు ఖుష్బూ, జయప్రదలతో కలిసి మెగాస్టార్ కాలు కదిపారు. మంచి గ్రేస్‌తో చిరు వేసిన స్టెప్స్‌ అలరిస్తున్నాయి. ‘చిరు ఏజ్ పెరిగినా ఆయలోని ఎనర్జీ లెవల్స్ ఏమాత్రం తగ్గలేదు’ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..