చిరంజీవి ‘పునాదిరాళ్లు’ దర్శకుడు రాజ్ కుమార్ కన్నుమూత

మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం ‘పునాదిరాళ్లు’ చిత్ర దర్శకుడు గుడిపాటి రాజ్ కుమార్ శనివారం ఉదయం మృతిచెందారు..

  • Publish Date - February 15, 2020 / 06:27 AM IST

మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం ‘పునాదిరాళ్లు’ చిత్ర దర్శకుడు గుడిపాటి రాజ్ కుమార్ శనివారం ఉదయం మృతిచెందారు..

మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం ‘పునాదిరాళ్లు’ చిత్ర దర్శకుడు గుడిపాటి రాజ్ కుమార్ శనివారం ఉదయం మృతిచెందారు. ఆయనకు కూడా ఇది మొదటి సినిమా కావడం విశేషం.

మొదటి సినిమాకే ఐదు నంది అవార్డులు దక్కించుకున్నారు. అటువంటి దర్శకుడు, నిర్మాత రాజ్ కుమార్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

ఈ విషషం తెలిసి ఇటీవలే మెగాస్టార్  చిరంజీవి ఆయనకు అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అలాగే ప్రసాద్స్‌ క్రియేటివ్‌ మెంటర్స్‌ ఫిలిం మీడియా స్కూల్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ సురేష్‌రెడ్డి రూ.41వేలు, ‘మనం సైతం’ తరపున నటుడు కాదంబరి కిరణ్‌కుమార్‌ రూ.25 వేలు,

డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ రూ.50 వేలు, మెహర్‌ రమేష్‌ రూ.10 వేలు, నటుడు, దర్శకుడు కాశీవిశ్వనాథ్‌రూ.5 వేలు చొప్పున ఆయనకు ఆర్థిక సహాయం అందించగా.. వారి స్పందనకు రాజ్‌ కుమార్‌ కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. 

 

 

 ఆ మధ్య ఆయన పెద్ద కుమారుడు అనారోగ్యంతో మృతి చెందడం, ఆ తర్వాత భార్య చనిపోవడంతో రాజ్ కుమార్ ఒంటరివాడు అయ్యాడు. పైసా సంపాదన లేక అద్దె ఇంట్లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం మృతిచెందారు. ఆయన స్వగ్రామం కృష్ణాజిల్లా సమీపంలోని ఉయ్యూరు. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకు వెళ్ళేందుకు చిన్న కుమారుడు ఏర్పాట్లు చేస్తున్నారు  

Read Here>>వైద్యం చేస్తున్న 1700 డాక్టర్లకీ కరోనావైరస్.. చైనాకొచ్చిన కొత్త కష్టం!