Chiranjeevi : తల్లి ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి.. అలా ప్రచారం చెయ్యొద్దు..

తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన తల్లి ఆరోగ్యంపై ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చారు.

Megastar Chiranjeevi Gives Clarity on his Mother Health Tweet goes Viral

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి నేడు అస్వస్థతకు గురైందని, హాస్పిటల్ లో జాయిన్ చేశారని, సీరియస్ గా ఉందని ఉదయం నుంచి పలు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ వార్తలను చిరంజీవి టీమ్ ఖండించగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన తల్లి ఆరోగ్యంపై ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చారు.

Also Read : Aanand Vardhan : ఆ రోజు నా మాటలకు చిరంజీవి ఏడ్చేశారు.. చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్.. ఇప్పుడు హీరోగా..

చిరంజీవి తన ట్వీట్ లో.. మా అమ్మ అస్వస్థతగా ఉందని, ఆసుపత్రిలో చేరిందని కొన్ని మీడియా కథనాలు చూసాను. కొన్ని రోజులు ఆమె కాస్త అస్వస్థతకు గురైంది. కానీ ఇప్పుడు ఆమె పూర్తి ఆరోగ్యంగా, హుషారుగా ఉంది. ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ఊహాజనిత నివేదికలను ప్రచురించవద్దని అన్ని మీడియాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అర్ధం చేసుకుంటారని కోరుకుంటున్నాను అని రాసుకొచ్చారు.

దీంతో చిరంజీవి తల్లి ప్రస్తుతం ఆరోగ్యంగా, క్షేమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడితో, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సినిమాలు చేయనున్నారు.