Urvashi Rautela : ఇది కదా మెగాస్టార్ అంటే.. ఆ హీరోయిన్ వాళ్ళ అమ్మకు బాలేదంటే.. కలకత్తా అపోలో హాస్పిటల్ కి ఫోన్ చేయించి..

తాజాగా బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా కూడా వాళ్ళ అమ్మ ఆరోగ్యం విషయంలో చిరంజీవి సాయం చేసారు అని తెలిపింది.

Megastar Chiranjeevi Helped for Actress Urvashi Rautela Mother Health Issue

Urvashi Rautela : మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో తన నటనతోనే కాదు నిజ జీవితంలో తన సాయంతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి ప్రాణదానం చేసారు. బయట లెక్కలేనన్ని సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. తన అభిమానులకు ఏదైనా కష్టం వస్తే అడక్కుండానే తీర్చిన సంఘటనలు చాలా ఉన్నాయి.

సినీ పరిశ్రమలో కూడా ఎవరైనా ఆరోగ్య పరంగా సమస్యలు ఎదుర్కుంటూ, ఆర్ధిక సమస్యలతో సతమతం అయితే అపోలో హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి వాళ్లకు కావాల్సిన ట్రీట్మెంట్ చేయిస్తారు మెగాస్టార్. ఇప్పటికే పలువురు సీనియర్ నటులు చాలా మంది చిరంజీవి తమకు అపోలోలో ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించాడని చెప్పారు. తాజాగా బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా కూడా వాళ్ళ అమ్మ ఆరోగ్యం విషయంలో చిరంజీవి సాయం చేసారు అని తెలిపింది.

Also Read : Akanksha Sharma : విశ్వక్ ‘లైలా’ సినిమా హీరోయిన్.. అయిదేళ్ల క్రితమే మహేష్ బాబుతో నటించిందని తెలుసా? మహేష్ గురించి ఏం చెప్పిందంటే..

ఊర్వశి రౌటేలా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా అమ్మ లెఫ్ట్ లెగ్ బోన్ కి సంబంధించి సీరియస్ సమస్యతో బాధపడుతుండేది. ఆమె ట్రీట్మెంట్ కు చాలా చోట్ల చూపించాం కానీ సరైన సొల్యూషన్ దొరకలేదు. ఆ సమయంలో నేనే చిరంజీవి గారిని ఇబ్బంది పడుతూనే సహాయం అడిగాను. అప్పుడు ఆయన కలకత్తాలోని అపోలో హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడించి బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించేలా చేసారు. అనంతరం ఆయన మీ అమ్మ బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది అని ధైర్యం ఇచ్చారు. చిరంజీవి గారు చేసిన సాయానికి మేము ఎప్పటికి ఆయనకు రుణపడి ఉంటాము అని తెలిపింది. ఇటీవల కొన్ని రోజుల క్రితం ఊర్వశి తన తల్లి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. తన తల్లి గురించి ప్రార్థించమని పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read : Vishwak Sen : మూడు నెలలు తిప్పించుకున్నారు.. రెండు రోజులు ఏడ్చాను.. నాకే ఎందుకు ఇలా.. విశ్వక్ కెరీర్ స్టార్టింగ్ కష్టాలు..

దీంతో ఊర్వశి రౌటేలా వ్యాఖ్యలు వైరల్ గా మారగా అభిమానులు, నెటిజన్లు మరోసారి చిరంజీవిని అభినందిస్తున్నారు. ఇది కదా మెగాస్టార్ అంటే అడిగినా అడగకపోయినా సాయం చేయడంలో ముందుంటారు అని అంటున్నారు. ఇక ఊర్వశి రౌటేలా బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తూనే అన్ని పరిశ్రమలో స్పెషల్ సాంగ్స్ లో నటిస్తుంది. తెలుగులో గతంలో చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాలో కలిసి ఓ స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేసింది. ఇటీవల సంక్రాంతికి బాలయ్యా డాకు మహారాజ్ సినిమాలో కూడా దబిడి దబిడి స్టెప్పులతో అలరించింది.