Chiranjeevi : నాగార్జున నాకు డాక్టర్.. అఖిల్ నన్ను పెదనాన్న అని పిలుస్తుంటే.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..

చిరంజీవి మాట్లాడుతూ నాగార్జున, అఖిల్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Megastar Chiranjeevi Interesting Comments on Nagarjuna and Akhil in ANR National Award Event

Chiranjeevi : ఏఎన్నార్ నేషనల్ అవార్డు వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ నేషనల్ అవార్డుని అందించారు. ఈ కార్యక్రమానికి అనేకమంది టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ నాగార్జున, అఖిల్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నాగార్జున గురించి మాట్లాడుతూ.. నాగేశ్వరరావు గారి తర్వాత ఆ ప్రేమ మళ్ళీ నాకు నాగార్జున మీద కలిగింది. నాగార్జున నాకు ఎంతో ఇన్స్పిరేషన్. ఆరోగ్య సూత్రాలు పాటించడంలో, ఎక్సర్సైజ్ చేయడంలో ఎప్పుడూ యంగ్ గా ఉండడానికి నాగార్జున చూపించే శ్రద్ధ నాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. నాకు నాగార్జున స్నేహితుడు, బ్రదర్ మాత్రమే కాదు ఆరోగ్య సూత్రాలు చెప్పే డాక్టర్ కూడా. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అద్భుతమైన స్నేహితుడు నాగార్జున. నాగ్ లాంటి స్నేహితుడిని నేను జీవితాంతం పదిలంగా దాచుకుంటాను అని అన్నారు.

Also Read : Chiranjeevi – Sobhita : కాబోయే కోడలిని చిరంజీవికి పరిచయం చేసిన నాగార్జున.. ఫొటోలు వైరల్..

ఇక అఖిల్ గురించి మాట్లాడుతూ.. అఖిల్ నాకు మరో బిడ్డ లాగా. అఖిల్ నన్ను పెదనాన్న అని పిలుస్తున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళ పిల్లలందరూ మా కుటుంబ సభ్యులే. అక్కినేని కుటుంబం చూపించే ప్రేమకు నేను దాసుడిని అని అన్నారు.