Chiranjeevi – Sobhita : కాబోయే కోడలిని చిరంజీవికి పరిచయం చేసిన నాగార్జున.. ఫొటోలు వైరల్..
నాగచైతన్య, నాగార్జున, అక్కినేని ఫ్యామిలీ శోభితను పలువురు ప్రముఖులకు, ఈవెంట్ కి వచ్చిన గెస్టులకు పరిచయం చేసారు.

Nagarjuna Introduced Sobhita Dhulipala to Megastar Chiranjeevi Photos goes Viral
Chiranjeevi – Sobhita : నిన్న ఏఎన్నార్ నేషనల్ అవార్డు వేడుక ఘనంగా జరిగింది. ఏఎన్నార్ నేషనల్ అవార్డుని అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అక్కినేని ఫ్యామిలీ సమక్షంలో మెగాస్టార్ చిరంజీవికి అందించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సినీ ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు.
Also Read : Nagarjuna : చిరంజీవి డ్యాన్స్, గ్రేస్ చూసి భయపడ్డాను.. ఆ సినిమా చూసి మా మాస్ హీరో ఈజ్ బ్యాక్ అనుకున్నాను..
అయితే ఈ ఈవెంట్ కు కాబోయే అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ కూడా హాజరైంది. ఆల్రెడీ నిశ్చితార్థం అవ్వగా త్వరలో నాగచైతన్య – శోభిత పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. దీంతో నిన్నటి ఏఎన్నార్ అవార్డు ఈవెంట్ కు శోభిత నాగచైతన్యతో కలిసి వచ్చింది. ఈ ఈవెంట్లో శోభితనే హైలెట్ గా నిలిచింది. అందరి కళ్ళు కాబోయే జంటపైనే ఉన్నాయి.
ఇక నాగచైతన్య, నాగార్జున, అక్కినేని ఫ్యామిలీ శోభితను పలువురు ప్రముఖులకు, ఈవెంట్ కి వచ్చిన గెస్టులకు పరిచయం చేసారు. ఈ క్రమంలో నాగార్జున చిరంజీవిని పిలిచి మరీ శోభితను పరిచయం చేసారు. చిరంజీవి శోభితతో మాట్లాడారు. పక్కనే నాగ చైతన్య కూడా ఉన్నాడు. నాగార్జున చిరంజీవికి తనకు కాబోయే కోడలు శోభితను పరిచయం చేస్తున్న పలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.