Chiranjeevi – Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ..

నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు.

Megastar Chiranjeevi Meets Telangana CM Revanth Reddy

Chiranjeevi – Revanth Reddy : నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఇటీవల తెలంగాణలో వరదలు వచ్చి ఖమ్మం, పరిసర ప్రాంతాలు ముంపుకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరద బాధితుల కోసం చిరంజీవి, రామ్ చరణ్ రెండు రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్స్ కి ప్రకటించారు.

Also Read : Anushka – Thaman : ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న అనుష్క.. ప్రతి సంవత్సరం తమన్‌కి ఆ గిఫ్ట్..

తాజాగా చిరంజీవి సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి తన 50 లక్షలు, చరణ్ తరపున 50 లక్షలు చెక్కు రూపంలో అందించారు. సీఎం రేవంత్ రెడ్డి చిరంజీవికి ధన్యవాదాలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. అనంతరం చిరంజీవి, రేవంత్ రెడ్డి కాసేపు ముచ్చటించారు.

సీఎం రేవంత్ రెడ్డితో చిరంజీవి భేటీ అయిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.