Anushka – Thaman : ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న అనుష్క.. ప్రతి సంవత్సరం తమన్‌కి ఆ గిఫ్ట్..

తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అనుష్క శెట్టి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

Anushka – Thaman : ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న అనుష్క.. ప్రతి సంవత్సరం తమన్‌కి ఆ గిఫ్ట్..

Music Director Thaman Interesting Comments on Anushka Shetty

Updated On : September 16, 2024 / 11:37 AM IST

Anushka – Thaman : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అనుష్క గత కొన్నాళ్లుగా అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తుంది. చివరిసారిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అనుష్క శెట్టి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. తమన్ ప్రస్తుతం ఆహాలో వస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ మూడో సీజన్ లో గెస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

ఇటీవల వచ్చిన ఎపిసోడ్ లో అనుష్క ప్రస్తావన రాగా తమన్ మాట్లాడుతూ.. అనుష్క నా లైఫ్. అనుష్క అంటే నాకు చాలా ఇష్టం. అందం మాత్రమే కాదు తన మంచితనం కూడా ఇష్టం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో అనుష్క నుంచి ఒక నాకు ఐ ఫోన్ గిఫ్ట్ గా వస్తుంది. భాగమతి హిట్ అయితే గిఫ్ట్స్ ఇస్తాను అని చెప్పింది. నాకు గాడ్జెట్స్ అంటే ఇష్టం కాబట్టి ప్రతి సంవత్సరం కొత్త ఐ ఫోన్ రిలీజ్ అవ్వగానే నాకు పంపిస్తుంది. నా చేతిలో ఉన్న ఫోన్ కూడా అనుష్క ఇచ్చిందే అని తెలిపాడు తమన్.

Also Read : Onam 2024 : ఓనమ్ స్పెషల్.. చీరల్లో హీరోయిన్స్.. ముద్దుగుమ్మల ఫొటోలు చూశారా?

దీంతో తమన్ వ్యాఖ్యలు అనుష్క ఫ్యాన్స్ వైరల్ చేస్తూ ఆమెని పొగుడుతున్నారు. అనుష్క ఎప్పుడో భాగమతి సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఇప్పటికి కూడా తమన్ కి ఐ ఫోన్ గిఫ్ట్ ఇస్తుంది అంటే నిజంగా గ్రేట్ అని పొగిడేస్తున్నారు.