Chiranjeevi: సునీల్ నారంగ్ కూతురు నిర్మాతగా సినిమా చేస్తున్నా..! కుబేర సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన

నాకు తెలిసి నాగార్జున ఎవరి కాళ్లకు దండం పెట్టడు. ఒక్క మీ నాన్నగారికి తప్ప. నాకూ ఆయనంటే అంత ఇష్టం.

Chiranjeevi: కుబేర సక్సెస్ మీట్ లో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన చేశారు. తన నెక్ట్స్ మూవీ గురించి అందులో రివీల్ చేశారు. ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ ఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు చిరంజీవి. సునీల్ నారంగ్ కూతురు నిర్మాతగా మూవీ చేయబోతున్నట్లు చిరంజీవి ప్రకటించారు.

”సునీల్ నారంగ్, భరత్.. వారిద్దరికంటే వారి నాన్న నాకు చాలా గౌరవనీయులు. పెద్ద మనిషి. నికార్సైన మనిషి. సినిమా వ్యాపారంలో అంత హానెస్ట్ తో ఉన్న వ్యక్తి ఎవరూ లేరు. నాకు తెలిసి నాగార్జున ఎవరి కాళ్లకు దండం పెట్టడు. ఒక్క మీ నాన్నగారికి తప్ప. నాకూ ఆయనంటే అంత ఇష్టం. ఆయన పిల్లలుగా ఆయన గౌరవాన్ని కాపాడుతూ, ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ మీ ఇద్దరూ ముందుకెళ్లడం సంతోషం.

మీరే కాకుండా థర్డ్ జనరేషన్ జాన్వి కూడా అదే దారిలో వెళ్లడం జరుగుతోంది. సర్ మీరు మళ్లీ మాకో సినిమా చేయాలని సునీల్ నారంగ్ నన్ను అడిగారు. నేను వద్దులే అన్నాను. సర్ మా నాన్నగారు మీ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసి అప్పుడు నైజాంలో బాగా డబ్బులు గడించారు. మీరు నైజాం కింగ్ అనుకునే వారం. ఆ తర్వాత మేమూ కొంచెం ప్రయత్నం చేశాం సార్. నాకూ బాగా డబ్బులు వచ్చాయని సునీల్ నారంగ్ నాతో చెప్పారు.

మా థర్డ్ జనరేషన్ జాన్వి కూడా సినిమాలు తీసి ప్రొడ్యూసర్ గా రావాలి అనుకుంటున్నట్లు ఆయన నాతో చెప్పారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు హర్. జాన్విని కలుస్తాను అని సునీల్ తో చెప్పాను. మీరు మాతో మరో సినిమా చేస్తే మా ఫ్యామిలీ మూడు జనరేషన్లతో మంచి సంబంధం ఉన్నట్లు అవుతుందని సునీల్ నారంగ్ నాతో అన్నారు. జాన్వి.. మీ నాన్న అడిగారు. వు ఆర్ డూయింగ్ అని” చిరంజీవి చెప్పారు. అయితే ధనుష్ లాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్లు వద్దమ్మా అంటూ నవ్వులు పూయించారు. ఫన్ ఓరియంటెండ్, మాస్ ఓరియంటెండ్, సరదాగా గ్లామర్ గా ఉండాలని జాన్వితో చెప్పారు చిరంజీవి.

Also Read: డ్ర‌గ్స్ క‌ల‌క‌లం.. చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్‌..