Megastar Chiranjeevi Next Movie will announce on Chiranjeevi Birthday Rumours goes viral
Chiranjeevi Next Movie : మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ఒక హిట్ ఒక ఫ్లాప్ అన్నట్టు సాగుతుంది. వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమాతో భారీ హిట్ కొట్టి 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన చిరంజీవి భోళా శంకర్(Bholaa Shankar) సినిమాతో మాత్రం బోల్తా పడ్డాడు. తమిళ్ వేదాళం సినిమాకు రీమేక్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ సినిమా మొదటి రోజు మిక్స్‌డ్ టాక్ వచ్చినా రెండో రోజు నుంచి సినిమాని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఓ పక్క జైలర్ పెద్ద హిట్ అవ్వడంతో కలెక్షన్స్ విషయంలో భోళా శంకర్ కి మరింత దెబ్బ పడింది.
ముఖ్యంగా చిరంజీవి ఇకపై రీమక్స్ చేయొద్దు అని ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా భోళా శంకర్ రిలీజ్ అవ్వడంతో చిరంజీవి నెక్స్ట్ సినిమా ఏంటి అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇటీవల చిరంజీవి తన నెక్స్ట్ సినిమా తన కూతురు సుస్మిత కొణిదెల నిర్మాణంలో గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఉండబోతుందని ఓ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా హింట్ ఇచ్చాడు. అయితే అది ఏ సినిమా, ఏ దర్శకుడితో తీస్తున్నాడు అని మాత్రం చెప్పలేదు.
మెగా కాంపౌండ్ సమాచారం ప్రకారం చిరంజీవి ఇప్పటికే తన నెక్స్ట్ సినిమాలకు డైరెక్టర్స్ కళ్యాణ్ కృష్ణ, వశిష్ట మల్లిడి లను ఓకే చేశాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సుస్మిత కొణిదెల నిర్మాణంలో చిరంజీవి నెక్స్ట్ సినిమా ఉండబోతుందని సమాచారం. అయితే ఇది సొంత కథా లేదా మలయాళం సినిమా ‘బ్రో డాడీ’కి రీమేక్ సినిమానా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమా బాగున్నా సరే రీమేక్ అయితే వద్దు అని అభిమానులు కోరుతున్నారు. ఇక వశిష్ఠ సినిమా మాత్రం కొత్త కథ అని, బింబిసార లాగే సోషియో ఫాంటసీ అని సమాచారం.
ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజు కావడంతో ఆ రోజు చిరంజీవి నెక్స్ట్ సినిమాని అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. దీంతో చిరు నెక్స్ట్ సినిమా ఎవరితో ఏ సినిమానో క్లారిటీ రావాలంటే మెగాస్టార్ బర్త్ డే వరకు ఆగాల్సిందే.