చిరు సింగిల్ సిట్టింగులో స్టోరి ఓకే చేశారు..

మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడవ సినిమా తెరకెక్కనుంది..

  • Published By: sekhar ,Published On : March 3, 2020 / 02:53 PM IST
చిరు సింగిల్ సిట్టింగులో స్టోరి ఓకే చేశారు..

Updated On : March 3, 2020 / 2:53 PM IST

మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడవ సినిమా తెరకెక్కనుంది..

10TV Exclusive : మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో స్పీడ్ పెంచారు. ‘ఖైదీ నెం:150’, ‘సైరా’ సినిమాల తర్వాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్, బోయపాటి శ్రీను వంటి దర్శకులు చిరుతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొరటాల చిత్రం తర్వాత మెగాస్టార్ మలయాళం మూవీ ‘లూసిఫర్’ రీమేక్‌లో నటిస్తారని, సుకుమార్, వి.వి. వినాయక్, సుజిత్ వంటి దర్శకుల పేర్లు వినిపించాయి.

కానీ చిరు సైడ్ నుంచి క్లారిటీలేదు. కట్ చేస్తే.. చిరు, వినాయక్ దర్శకత్వంలో సినిమా చేయడం ఫిక్స్ అయిపోయింది. ముందుగా మెగాస్టార్, ‘లూసిఫర్’ రీమేక్ వినయ్‌ను చేయమన్నారు. ఇటీవలే వినయ్ ‘సినిమా చూపిస్తమావ’, ‘నేను లోకల్’, ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’ ‘హలోగురు ప్రేమకోసమే’ వంటి సినిమాలకు రచయితగా పనిచేసి గుర్తింపు పొందిన ప్రసన్నకుమార్ బెజవాడ చెప్పిన కథ విన్నారు.

ఆయనకు బాగా నచ్చడంతో ‘ముందు ప్రసన్న చెప్పిన కథ వినండి అన్నయ్య.. మీకు నచ్చితే ఓకే.. లేదంటే ‘లూసిఫర్’ చేద్దాం’ అని చిరుకి చెప్పగా.. తాజాగా ఆయన ప్రసన్న కథ విన్నారు. సింగిల్ సిట్టింగులోనే స్టోరి ఓకే చేసేశారు.. ప్రస్తుతం వినాయక్, ప్రసన్న ఈ కథపై పూర్తిస్థాయిలో వర్క్ చేస్తున్నారు. చిరు సింగిల్ సిట్టింగులో స్టోరి ఓకే చేశారంటే చిన్న విషయం కాదు.. కచ్చితంగా మేటర్ ఉండే ఉంటుంది. ‘ఠాగూర్’, ‘ఖైదీ నెం:150’ సినిమాల తర్వాత చిరు, వినాయక్ కాంబినేషన్‌లో రూపొందబోయే ఈ హ్యాట్రిక్ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా  తెలియచేయనున్నారు.