Megastar Chiranjeevi Received Outstanding Achievement in Indian Cinema in IIFA2024
Megastar Chiranjeevi : ఒంటరిగా ఆసిని పరిశ్రమకి వచ్చి తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందరివాడవుగా మారిన మెగాస్టార్ సక్సెస్ జర్నీ మన అందరికి తెలిసిందే. ఆయన సినిమాల్లో నటన, డ్యాన్సులతో ప్రేక్షకులని మెప్పించి ఎన్నో సూపర్ హిట్స్ సాధించి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఆయనకు లెక్కలేనన్ని అవార్డులు రివార్డులు వచ్చిన సంగతి తెలిసిందే.
కానీ ఈ సంవత్సరం చిరంజీవికి వరుస అవార్డులు వస్తున్నాయి. ఈ సంవత్సరం మొదట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ ఇటీవలే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి మరింత ఎత్తుకు ఎదిగారు. ఆయన 156 సినిమాల్లో 537 పాటలకు గాను వేసిన 24000 డ్యాన్స్ స్టెప్స్ కి గిన్నిస్ బుక్ లో పేరు ఎక్కడం విశేషం. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన అవార్డు లభించింది.
Also Read : Prabhas: మరో భారీ సినిమాకు ఓకే చెప్పిన ప్రభాస్?
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ లో 2024 సంవత్సరానికి గాను మెగాస్టార్ చిరంజీవి అవుట్ స్టాండింగ్ అఛీవ్మెంట్ ఇన్ ఇండియాన్ సినిమా అవార్డును అందుకున్నారు. తాజాగా IIFA వేడుకలు UAE లోని అబుదాబిలో ఘనంగా జరగ్గా టాలీవుడ్ లోని అనేక సినీ ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో చిరంజీవి బాలీవుడ్ స్టార్ రైటర్ జావేద్ అక్తర్ నుంచి అవుట్ స్టాండింగ్ అఛీవ్మెంట్ ఇన్ ఇండియాన్ సినిమా అవార్డును అందుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
#MegastarChiranjeevi garu received the "Outstanding Achievement in Indian Cinema" Award at the IIFA event in Abu Dhabi.
MEGASTAR #Chiranjeevi ✨ @KChiruTweets pic.twitter.com/9cbkiFJptJ
— Pulagam Chinnarayana (@PulagamOfficial) September 27, 2024