Prabhas: మరో భారీ సినిమాకు ఓకే చెప్పిన ప్రభాస్?
ఇలాంటి టైంలో ప్రభాస్ మరో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడని

Hero Prabhas
డార్లింగ్ అన్నా..ప్రభాస్ అని పిలిచినా..ఆరు అడుగుల ఆ కటౌట్ వెండితీర మీద కనిపిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే. సాహో పెద్దగా ఆకట్టుకోకపోయినా..సలార్ సక్సెస్‌తో సమం చేశాడు ప్రభాస్. ఆదిపురుష్, రాధేశ్యామ్, కల్కి ఇలా..బ్లాక్ బస్టరా..హిట్టా..ఫట్టా అని పట్టించుకోవడం లేదు డార్లింగ్. వచ్చిన అవకాశాలను వచ్చినట్లుగా ఓకే చెప్పేస్తున్నారు. రాబోయే రెండు, మూడేళ్లు ప్రభాస్ షెడ్యూల్ అంతా ఫుల్ బిజీ.
రెబల్ స్టార్ చేస్తున్న మూవీస్ అన్నీ పాన్ ఇండియా సినిమాలే. వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్నవే. అసలు ప్రభాస్ ఎప్పుడు స్టోరీస్ వింటున్నాడు..ఎలా త్వరగా కంప్లీట్ చేస్తున్నాడంటూ మిగతా స్టార్స్ డిస్కషన్స్ చేస్తుంటారు. ప్రభాస్ స్పీడ్‌ను చూసి తాము పరిగెత్తాలని అనుకుంటుంటారు. కానీ అది ఏ హీరోకి సాధ్యం కావటం లేదు. ప్రభాస్ ప్రస్తుతం సలార్-2, కల్కి-2, ది రాజా సాబ్, ఫౌజి, కన్నప్ప, స్పిరిట్ ఇవి వరుస పెట్టి షూటింగ్ మొదలుకానున్నాయి. ఇందులో కొన్ని ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి.
ఇలాంటి టైంలో ప్రభాస్ మరో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్‌లో ఓ పెద్ద బ్యానర్ ప్రభాస్‌తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తుందంటున్నారు. ఇందులో ప్రభాస్ పరశురాముడిగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన, చేస్తున్న సినిమాలు ఒక లెక్క..పరశురాముడు ఇంకో లెక్కంటున్నారు. ఇది 2025 ఎండ్‌లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ లెక్కన ప్రతీ ఏడాది ప్రభాస్ సినిమాలు కనీసం రెండు రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
JR NTR : జపాన్‌కు వస్తా.. మహిళా అభిమానికి మాటిచ్చిన ఎన్టీఆర్.. వీడియో