JR NTR : జ‌పాన్‌కు వ‌స్తా.. మహిళా అభిమానికి మాటిచ్చిన ఎన్టీఆర్‌.. వీడియో

జ‌పాన్‌కు చెందిన ఓ మ‌హిళ ఎన్టీఆర్‌ను క‌లుసుకునేందుకు టోక్యో నుంచి లాస్ ఏంజెలిస్‌కు వ‌చ్చింది.

JR NTR : జ‌పాన్‌కు వ‌స్తా.. మహిళా అభిమానికి మాటిచ్చిన ఎన్టీఆర్‌.. వీడియో

A fan from Tokyo flies to LA to watch Jr NTR's latest blockbuster and meet him

Updated On : September 27, 2024 / 5:25 PM IST

జూనియ‌ర్ న‌టించిన దేవ‌ర సినిమా నేడు (శుక్ర‌వారం సెప్టెంబ‌ర్ 27)న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక ఈ సినిమాని అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో నిర్వ‌హిస్తున్న ప్ర‌తిష్ఠాత్మ‌క బియాండ్ పెస్ట్‌లో ప్ర‌ద‌ర్శించారు. ఈ ఫెస్ట్‌లో పాల్గొన్న ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌తో క‌లిసి సినిమాను చూశారు. ఆ త‌రువాత త‌న‌ను క‌లుసుకునేందుకు వ‌చ్చిన ప‌లువురు అభిమానుల‌తో మాట్లాడారు.

జ‌పాన్‌కు చెందిన ఓ మ‌హిళ ఎన్టీఆర్‌ను క‌లుసుకునేందుకు టోక్యో నుంచి లాస్ ఏంజెలిస్‌కు వ‌చ్చింది. ఈ విష‌యాన్ని చెబుతూ ఎన్టీఆర్‌తో మాట్లాడింది. జ‌పాన్‌లోనూ ఆయ‌న‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నార‌ని, త‌మ దేశానికి రావాల‌ని ఈ సంద‌ర్భంగా స‌ద‌రు మ‌హిళ ఎన్టీఆర్‌ను కోరింది. ఆమె మాట‌ల‌కు ఎన్టీఆర్ ఎంతో ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

JR NTR : దేవ‌ర రిజల్ట్.. అభిమానుల‌కు మాట ఇచ్చిన ఎన్టీఆర్‌.. ఇక‌పై..

అక్క‌డి అభిమానుల‌ను క‌లుసుకుని, వారితో సినిమాను చూసేందుకు త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని మాట ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.