JR NTR : దేవ‌ర రిజల్ట్.. అభిమానుల‌కు మాట ఇచ్చిన ఎన్టీఆర్‌.. ఇక‌పై..

జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టించిన మూవీ దేవ‌ర‌.

JR NTR : దేవ‌ర రిజల్ట్.. అభిమానుల‌కు మాట ఇచ్చిన ఎన్టీఆర్‌.. ఇక‌పై..

JR NTR tweet on devara result

Updated On : September 27, 2024 / 2:43 PM IST

జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టించిన మూవీ దేవ‌ర‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా నేడు (సెప్టెంబ‌ర్ 27 శుక్ర‌వారం) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప‌లు చోట్ల అర్థ‌రాత్రి 1 గంటకే స్పెష‌ల్ షోస్ ప‌డ్డాయి. తొలి ఆట నుంచే ఈ మూవీకి మంచి స్పంద‌న వ‌స్తోంది. దీంతో 23 ఏళ్ల తర్వాత తన తండ్రి సెంటిమెంట్ బ్రేక్ అయింది అంటూ రాజమౌళి కొడుకు కార్తికేయ సైతం ట్వీట్ చేశాడు. ప్రేక్ష‌కులు త‌న మూవీపై చూపిస్తున్న ఆద‌ర‌ణ‌పై జూనియ‌ర్ ఎన్టీఆర్ స్పందించారు.

తాను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోజు రానే వ‌చ్చింద‌న్నారు. అభిమానులు చూపించే ప్రేమ‌కు తాను ఎన్న‌టికి రుణ‌ప‌డి ఉంటాన‌ని చెప్పుకొచ్చారు. చిత్ర బృందానికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ఈ మేర‌కు ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.

Devara Review : ‘దేవర’ మూవీ రివ్యూ.. బాహుబలి ట్విస్ట్ ఇచ్చిన కొరటాల శివ..

‘నేను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. మీ అపురూపమైన స్పందనలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాను. అద్భుత‌మైన డ్రామా, భావోద్వేగాల‌తో దేవ‌ర‌ను తీర్చిదిద్దినందుకు కొర‌టాల శివ‌కు థ్యాంక్స్‌. మై బ్ర‌ద‌ర్ అనిరుద్‌.. నీ సంగీతంతో మా ప్ర‌పంచానికి ప్రాణం పోశావు. ఈ చిత్రానికి బ‌ల‌మైన స‌పోర్టుగా నిలిచిన మా నిర్మాతలు మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ల‌తో పాటు అద్భుతంగా వర్క్‌ చేసిన సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు, సాబు సిరిల్‌తోపాటు టెక్నీషియన్స్‌ అందరికీ కృతజ్ఞతలు.’ అని ఎన్టీఆర్ అన్నారు.

‘నా అభిమానుల వేడుక చూసి ఎంతో ఆనందంగా ఉంది. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నాలాగే మీరు కూడా సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయ‌డం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. మీకు మ‌రెంతో వినోదాన్ని అందిస్తాన‌ని మాటిస్తున్నాను.’ అని ఎన్టీఆర్ తెలిపారు.

Devara : ఫైన‌ల్‌గా 23 ఏళ్ల జ‌క్క‌న్న‌ ఫ్లాప్ సెంటిమెంట్‌కు ఎన్టీఆర్ బ్రేక్‌.. రాజమౌళి కొడుకు కామెంట్స్..