Devara : ఫైన‌ల్‌గా 23 ఏళ్ల జ‌క్క‌న్న‌ ఫ్లాప్ సెంటిమెంట్‌కు ఎన్టీఆర్ బ్రేక్‌.. రాజమౌళి కొడుకు కామెంట్స్..

ఇక ఇప్పుడు ఈ మిత్‌ను ఎన్టీఆర్ దేవ‌ర‌తో బ్రేక్ చేశారు.

Devara : ఫైన‌ల్‌గా 23 ఏళ్ల జ‌క్క‌న్న‌ ఫ్లాప్ సెంటిమెంట్‌కు ఎన్టీఆర్ బ్రేక్‌.. రాజమౌళి కొడుకు కామెంట్స్..

Devara break rajamouli flop sentiment myth after 23 years says SS Karthikeya

Updated On : September 27, 2024 / 11:09 AM IST

Devara : ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని దాదాపుగా ప్ర‌తి హీరో కోరుకుంటూ ఉంటాడు. ఆ సినిమా ఖ‌చ్చితంగా హిట్ లేదా బ్లాక్ బాస్ట‌ర్‌గా హిట్‌గా నిలవ‌డ‌మే అందుకు కార‌ణం. అయితే.. రాజ‌మౌళితో సినిమా చేసిన త‌రువాత ఏ హీరో కూడా వెంట‌నే మ‌రో హిట్ కొట్టిన సంద‌ర్భం లేదు. ఇది ఎన్టీఆర్ న‌టించి స్టూడెంట్ నెంబ‌ర్ 1 నుంచి ఓ ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఇది ఓ మిస్ట‌రీలాగా ఉండిపోయింది. ఇక ఇప్పుడు ఈ మిత్‌ను ఎన్టీఆర్ దేవ‌ర‌తో బ్రేక్ చేశాడ‌ని అంటున్నారు.

ఎన్టీఆర్‌, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన స్టూడెంట్ నెంబ‌ర్ 1 సెప్టెంబ‌ర్ 27, 2001 విడుద‌లైంది. ఇక దేవ‌ర కూడా సరిగ్గా సెప్టెంబ‌ర్ 27 విడుద‌లైంది. అంటే.. ఈ మిత్ 23 ఏళ్ల కింద‌ట ఏ హీరోతో మొద‌లైందో, మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు అదే హీరోతో అదే రోజుతో ముగిసింద‌ని సోష‌ల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

Devara Day 1 Collection : ‘దేవర’ బాక్సాఫీస్ అంచ‌నా.. తొలిరోజే 125 కోట్ల కలెక్షన్స్! కల్కితో పోలిస్తే..

ఇక ఇదే విష‌యం పై ద‌ర్శ‌కదీరుడు రాజ‌మౌళి కుమారుడు కార్తికేయ స్పందించాడు. ఫైన‌ల్‌గా 23 ఏళ్ల ఈ మిత్ బ్రేక్ అయింది. ఏ వ్య‌క్తితో ఏ రోజు అయితే మొద‌లైందో మ‌ళ్లీ అదే రోజు అదే వ్య‌క్తితో అదే రోజు బ‌ద్ద‌లైంది అని అన్నారు. చిన్న‌ప్ప‌టి నుంచి ఎన్టీఆర్‌ను ఎంతో ద‌గ్గ‌ర‌గా చూస్తున్నాన‌ని, ఆయ‌న ఎదుగుద‌ల‌ను, స‌క్సెస్‌ను చూస్తూ పెరిగిన‌ట్లుగా చెప్పుకొచ్చారు.

‘ఆయ‌న చేసిన అద్భుతాల‌ను చూస్తున్నాను. తెలుగు సినిమాకు ఆయ‌న చేస్తున్న కృషిని చూస్తూ ఉన్నాను. నాకు మాట‌లు రావ‌డం లేదు. ఫ్యాన్స్ పండ‌గ చేసుకోండి. దేవ‌ర ది బిగ్గెస్ట్ మాస్ సెలెబ్రేష‌న్స్ ఇన్ సినిమా. ఇక ఇప్పుడు మ్యాడ్‌నెస్ కూడా మాట్లాడుతుంది.’ అని కార్తికేయ ట్విట్ చేశాడు. దేవ‌ర‌కు ముందు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీలో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

Game Changer :’ రా మ‌చ్చా మ‌చ్చా’ సాంగ్‌.. సింగిల్ డాన్స్ సీక్వెన్స్‌తో దుమ్ము రేపిన రామ్‌చ‌ర‌ణ్‌.. 1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులు

ద‌ర్శ‌కదీరుడు రాజ‌మౌళి, కార్తికేయ‌లు హైద‌రాబాద్‌లోని ఓ థియేట‌ర్‌లో దేవ‌ర సినిమాను చూశారు. సినిమా చూసిన త‌రువాత కార్తికేయ పై విధంగా స్పందించాడు.

 

View this post on Instagram

 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)