Devara Day 1 Collection : ‘దేవర’ బాక్సాఫీస్ అంచ‌నా.. తొలిరోజే 125 కోట్ల కలెక్షన్స్! కల్కితో పోలిస్తే..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర‌.

Devara Day 1 Collection : ‘దేవర’ బాక్సాఫీస్ అంచ‌నా.. తొలిరోజే 125 కోట్ల కలెక్షన్స్! కల్కితో పోలిస్తే..

Devara Part 1 box office prediction day 1

Updated On : September 27, 2024 / 10:32 AM IST

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం ‘దేవ‌ర‌’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ నేడు (శుక్ర‌వారం) ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలలో అర్థ‌రాత్రి 1 గంట‌కు షోల‌ను వేశారు. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్‌లో అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు దాదాపు 125 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

ఈ జాబితాలో ప్ర‌భాస్‌, దీపికా ప‌దుకొనే న‌టించిన క‌ల్కి 2898 AD తొలి స్థానంలో ఉంది. క‌ల్కి ప్ర‌పంచ వ్యాప్తంగా తొలి రోజున రూ.177.70 కోట్ల‌ను వ‌సూలు చేసింది. ఇక దేవ‌ర విష‌యానికి వ‌స్తే.. ప్ర‌పంచ వ్యాప్తంగా సుమారు రూ.75 కోట్ల అడ్వాన్స్ బుకింగ్‌లను నమోదు చేసిందని ఫిల్మ్ ట్రేడ్ పోర్టల్ సక్‌నిల్క్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్/తెలంగాణ మార్కెట్‌లో ఈ చిత్రానికి రూ.65-70 కోట్ల వరకు గ్రాస్ క‌లెక్ష‌న్లు రావొచ్చున‌ని అంచనా వేస్తున్నారు.

Devara : ఎన్టీఆర్ ‘దేవర’ రిలీజ్.. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రచ్చ చూశారా..? ఇదెక్కడి మాస్ సెలబ్రేషన్స్ రా బాబు..

ఈ సినిమా ఓవరాల్‌గా ఇండియా బాక్సాఫీస్ వ‌ద్ద మొద‌టి రోజు రూ.85-90 కోట్ల మ‌ధ్య వ‌సూళ్లు చేసే అవ‌కాశం ఉండవచ్చున‌ని పేర్కొంది. ప్రీమియర్ అమ్మకాలతో సహా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం రూ. 40 కోట్ల (5 మిలియన్ డాలర్లు) విలువైన‌ టిక్కెట్లు అమ్ముడయ్యాయని తెలిపింది.

దేవర కు ఆంధ్రప్రదేశ్‌లో రూ. 16.31 కోట్ల టిక్కెట్‌ విక్రయాలు జరగగా, కర్ణాటకలో రూ. 5.85 కోట్ల టిక్కెట్లు, తెలంగాణలో 12.88 కోట్ల టిక్కెట్లు అమ్ముడుపోయాయి.

ఇదిలా ఉంటే.. ప్రభాస్, దీపికా పదుకొణె నటించిన కల్కి 2898 ఏడీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను సాధించిన రెండవ భారతీయ చిత్రంగా దేవర అవతరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Devara vs Game Changer : దేవర, గేమ్‌ ఛేంజర్‌ మూవీస్‌ మధ్య యుద్ధం ?