Devara : ఎన్టీఆర్ ‘దేవర’ రిలీజ్.. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రచ్చ చూశారా..? ఇదెక్కడి మాస్ సెలబ్రేషన్స్ రా బాబు..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవరకి థియేటర్స్ లో చేస్తున్న రచ్చ చూసేయండి..

Devara : ఎన్టీఆర్ ‘దేవర’ రిలీజ్.. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రచ్చ చూశారా..? ఇదెక్కడి మాస్ సెలబ్రేషన్స్ రా బాబు..

NTR Devara Movie Fans Celebrations at Theaters Videos goes Viral

Updated On : September 27, 2024 / 6:43 AM IST

Devara : హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఫ్యాన్స్ చేసే సందడి మనకు తెలిసిందే. ఇక స్టార్ హీరోల సినిమాలకైతే అర్ధరాత్రి నుంచే థియేటర్స్ వద్ద హడావిడి చేస్తారు. తమ హీరోలకు కటౌట్లు, బ్యానర్లు, పూల దండలు, పాలాభిషేకాలు, టపాసులు పేల్చడం, డప్పులు కొట్టడం.. ఇలా అన్ని రకాలుగా తమ హీరో సినిమాని సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్యాన్స్.

ఎన్టీఆర్ దేవర సినిమా నేడు సెప్టెంబర్ 27న రిలీజ్ అయింది. ఇప్పటికే అర్ధరాత్రి నుంచి మిడ్ నైట్ షోలు, బెనిఫిట్ షోలు చాలా థియేటర్స్ లో వేశారు. దీంతో ఆ థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రాత్రి నుంచే హంగామా చేస్తున్నారు. థియేటర్ బయట కటౌట్లు, బ్యానర్లు, పూల దండాలు, పాలాభిషేకాలతో సందడి చేస్తుంటే థియేటర్ లోపల కొంతమంది పేపర్లు ఎగరేస్తూ, హారతులు ఇస్తూ, పూలు విసురుతూ రచ్చ చేస్తున్నారు.

Also Read : Devara : ‘దేవర’ ట్విట్టర్ రివ్యూ.. ఫ్యాన్స్, ఆడియన్స్ రియాక్షన్స్ ఏంటి..?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవరకి థియేటర్స్ లో చేస్తున్న రచ్చ చూసేయండి..