మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నారు. ఇక నేడు ప్రపంచ నాట్యదినోత్సవం సందర్భంగా తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఒక వీడియో పోస్ట్ చేశారు. డ్యాన్స్‌తో తనకు ఉన్న అనుబంధం మరువలేనిదని, అదే తనకు కోట్లాది మంది అభిమానులు తెచ్చిపెట్టిందని మెగాస్టార్ అన్నారు.
అలానే తనకు ఎప్పుడైనా పని ఎక్కువై మానసికంగా ఒత్తిడికి గురైన సందర్భంలో మంచి మ్యూజిక్ పెట్టుకుని వింటూ డాన్స్ చేస్తూ ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉండేదని, ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంట్లో ఉంటున్న మీరు కూడా ఎప్పుడైనా ఒత్తిడికి గురుయితే ఈ విధంగానే చేయమని మెగాస్టార్ ప్రజలకు సూచిస్తూ అందరికీ నాట్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ప్రపంచ నాట్యదినోత్సవం సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన డాన్స్ క్లిప్పింగ్స్‌తో కూడిన వీడియోని బుధవారం సాయంత్రం 6 గంటలకు ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తాను అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.