Megastar Chiranjeevi Vishwambhara Movie New Poster Released on Chiranjeevi Birthday
Vishwambhara : నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. తెలుగు రాష్ట్రాల్లో అయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు అభిమానులు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్, నెటిజన్లు, ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మన హీరోల పుట్టిన రోజులకు వాళ్ళు చేస్తున్న సినిమా నుంచి అప్డేట్స్ కచ్చితంగా ఇస్తారు.
Also See : Megastar Chiranjeevi : చిరంజీవి బర్త్ డే స్పెషల్.. ఎవ్వరూ చూడని మెగాస్టార్ పాత ఫొటోలు..
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సిస్టర్ సెంటిమెంట్ తో పాటు సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని చెప్పడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. నేడు చిరంజీవి పుట్టిన రోజు కావడంతో ఇవాళ తెల్లవారుజామున విశ్వంభర సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు డైరెక్టర్ వశిష్ఠ.
ఈ పోస్టర్ చూస్తుంటే.. ఒక పెద్ద కొండ లోపల ఏదో కొత్త ప్రపంచంలోకి చిరంజీవి వెళ్తున్నట్టు ఉంది. ఇక ఈ పోస్టర్ ని షేర్ చేసి మెగాస్టార్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి ఇవాళ ఉదయం 10 గంటల 8 నిమిషాలకు విశ్వంభర సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ రానుంది అని పోస్ట్ చేసారు. దీంతో మెగా అభిమానులు విశ్వంభర అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేస్తామని మరోసారి క్లారిటీ ఇచ్చారు.
The legend shall rise on this special day ?
Today at 10.08 AM. Stay tuned.#Vishwambhara
Get ready for a MEGA MASS BEYOND UNIVERSE, In cinemas from January 10th, 2025 ?#HBDMegastarChiranjeevi
MEGASTAR @KChiruTweets @trishtrashers @AshikaRanganath @kapoorkkunal… pic.twitter.com/vGGqeuNBna
— Vassishta (@DirVassishta) August 21, 2024