Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ అప్డేట్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..

తాజాగా నేడు విశ్వంభర సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు.

Megastar Chiranjeevi Vishwambhara Movie Teaser Update Details Here

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి యువీ క్రియేషన్స్ లో డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. సిస్టర్ సెంటిమెంట్ తో పాటు సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా చిరంజీవికి చెల్లెలుగా అయిదుగురు నటిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే విశ్వంభర టైటిల్ గ్లింప్స్, చిరంజీవి పోస్టర్ రిలీజ్ చేయగా తాజాగా నేడు విశ్వంభర సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు. విశ్వంభర సినిమా టీజర్ రేపు రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు చిరంజీవి కత్తి పట్టుకొని ఉన్న అదిరిపోయే పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. రేపు దసరా సందర్భంగా ఉదయం 10:49 గంటలకు విశ్వంభర టీజర్ రిలీజ్ చేయనున్నారు.

 

దీంతో మెగా ఫ్యాన్స్ విశ్వంభర టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. పోస్టర్ లో కత్తి పట్టుకొని చిరు ఆవేశంగా వెళ్తున్నట్టు ఉండటంతో టీజర్ లో సోషియో ఎలిమెంట్స్ తో పాటు మంచి మాస్ సీన్ కూడా ఉంటుందేమో అని ఆశిస్తున్నారు.