MAA Elections : మా ఎన్నికలపై తొలిసారి స్పందించిన మెగాస్టార్..కృష్టంరాజుకి లేఖ

టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా)ఎన్నికలపై మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా స్పందించారు.

MAA Elections  టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా)ఎన్నికలపై మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా స్పందించారు. “మా” ఎన్నికలు వెంటనే జరపాలని, ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని పేర్కొంటూ ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణం రాజుకు చిరంజీవి ఓ లేఖ రాశారు. సభ్యుల బహిరంగ ప్రకటనలతో ‘మా’ ప్రతిష్ట మసకబారుతుందని మెగాస్టార్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా’ ప్రతిష్ట దెబ్బతీస్తున్న ఎవరినీ ఉపేక్షించవద్దని లేఖలో మెగాస్టార్ కోరారు.

కాగా `మా` అధ్యక్ష బరిలో ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్‌ నర్సింహరావు పోటీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రతిసారీ ఇద్దరు మాత్రమే పోటీ పడే ఎన్నికలలో ఈసారి ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో మా ఎన్నికలు రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే.

గతంలో ఎన్నడూ లేనంతగా మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవలే మా ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్‌పై నటి హేమ..నిధుల ఖర్చు విషయంలో సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నరేష్‌ మాట్లాడుతూ ఆమెకు స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు. ఇక, ఆరోపణలు, ప్రత్యారోపణలతో మా ఎన్నికల ఘట్టం సాధారణ ఎన్నికలను తలపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు