Chiranjeevi – Meher Ramesh : మెగాస్టార్‌తో మళ్ళీ మెహర్ రమేష్.. అయ్యా వద్దయ్యా అంటున్న ఫ్యాన్స్, నెటిజన్స్..

ఇటీవల మెహర్ రమేష్ చిరంజీవి విశ్వంభర సెట్స్ కి వెళ్ళాడు.

Chiranjeevi – Meher Ramesh : మెగాస్టార్‌తో మళ్ళీ మెహర్ రమేష్.. అయ్యా వద్దయ్యా అంటున్న ఫ్యాన్స్, నెటిజన్స్..

Meher Ramesh Chiranjeevi Photo goes Viral from Vishwambhara Sets Netizens Trolled Meher

Chiranjeevi – Meher Ramesh : దర్శకుడు మెహర్ రమేష్ తన కెరీర్ లో ఆల్మోస్ట్ అన్నీ ఫ్లాప్స్ ఇవ్వడంతో ఆయా హీరోల అభిమానుల నుంచి, నెటిజన్స్ నుంచి బాగా ట్రోల్స్ ఎదుర్కొంటాడు. అయినా మెహర్ రమేష్ కి ఏదో విధంగా ఛాన్సులు వస్తుంటాయి. చివరిసారిగా మెహర్ గత సంవత్సరం మెగాస్టార్ చిరంజీవితో భోళాశంకర్ సినిమాని తీసాడు. తమిళ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన భోళాశంకర్ థియేటర్స్ లో మరో ఫ్లాప్ గా మిగిలింది.

అసలు మెహర్ కి ఛాన్స్ ఇవ్వడంపై అభిమానులు చిరంజీవి మీదకోపం తెచ్చుకున్నారు కూడా. ఎలాగో ఫ్లాప్ సినిమా ఇస్తాడని తెలిసి కూడా బాస్ ఎందుకు ఛాన్స్ ఇచ్చాడో తెలీదు అని భోళా ఫ్లాప్ అయ్యాక తీవ్రంగా ట్రోల్స్ కూడా వచ్చాయి. మెహర్ ని మరోసారి అందరూ విమర్శించారు. ఆ సినిమా తర్వాత మెహర్ మహేష్ బాబుతో సినిమా తీస్తాను, పవన్ తో తీయాల్సింది అని పలు ఇంటర్వ్యూలలో కామెంట్స్ చేయడంతో ఆ హీరోల అభిమానులు వద్దు బాబు మా హీరోతో సినిమా చేయకు అని ట్రోల్ చేసారు. తాజాగా మరోసారి మెహర్ రమేష్ ట్రోల్ అవుతున్నాడు.

Also Read : Chiranjeevi – Rajinikanth : రజినీకాంత్ చెప్పాడనే చిరంజీవి వాళ్ళతో సినిమాలు చేస్తున్నాడా?

ఇటీవల మెహర్ రమేష్ చిరంజీవి విశ్వంభర సెట్స్ కి వెళ్ళాడు. అక్కడ చిరంజీవితో మెహర్ రమేష్ దిగిన ఫోటో వైరల్ గా మారింది. తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ తరపున పలువురు దర్శకులు చిరంజీవిని కలవడానికి వెళ్లగా అందులో భాగంగా మెహర్ రమేష్ కూడా వెళ్ళాడు. మెహర్ రమేష్ చిరంజీవితో సపరేట్ గా దిగిన ఫోటో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు.. అయ్యా వద్దయ్యా మా చిరంజీవిని వదిలేయ్, మళ్ళీ చిరంజీవితో సినిమా అని మాత్రం చెప్పకు, బాస్ మెహర్ రమేష్ కి దూరంగా ఉండండి, ఫ్లాప్ ఇచ్చినా కూడా చిరంజీవి మెహర్ ని దగ్గరికి తీసుకున్నాడు అంటే చిరు గొప్పతనం అని.. ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి మెహర్ రమేష్ వైరల్ గా మారాడు. అయితే కేవలం ఫోటో కోసమే ఇద్దరూ కలిసి ఇలా క్లోజ్ గా ఫొటో దిగారని వీళ్లిద్దరి కాంబోలో మళ్ళీ సినిమా రాదని అంతా భావిస్తున్నారు.