Meher Ramesh : భోళాశంకర్ నుంచి మెగా అప్డేట్.. మెహర్ రమేష్ స్పెషల్ ట్వీట్..

తాజాగా భోళాశంకర్ సినిమా షూటింగ్ పూర్తయిందని డైరెక్టర్ మెహర్ రమేష్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. మెహర్ షూటింగ్ స్పాట్ లో చిరంజీవితో దిగిన ఫోటోలను తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ...

Meher Ramesh Tweet on Bholaa Shankar Movie Update

Bholaa Shankar :  మెహర్ రమేష్(Meher Ramesh) దర్శకత్వంలో చిరంజీవి(Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న సినిమా భోళాశంకర్. తమిళ్ సినిమా వేదాళం(Vedalam)కు రీమేక్ గా తెరకెక్కుతుంది ఈ సినిమా. ఇందులో తమన్నా(Tamannaah) హీరోయిన్ గా నటిస్తుండగా, కీర్తి సురేష్(Keerthy Suresh) చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తుంది. హీరో సుశాంత్(Sushanth) ముఖ్య పాత్రపోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజయి అభిమానులను మెప్పించింది. ఇక ఈ సినిమాని ఆగస్టు 11న రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు.

తాజాగా భోళాశంకర్ సినిమా షూటింగ్ పూర్తయిందని డైరెక్టర్ మెహర్ రమేష్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. మెహర్ షూటింగ్ స్పాట్ లో చిరంజీవితో దిగిన ఫోటోలను తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. భోళాశంకర్ సినిమా షూటింగ్ పూర్తయింది. గత కొన్ని రోజులుగా నాన్ స్టాప్ గా పగలు, రాత్రి షూటింగ్ కు సహకరించిన నటీనటులకు, టెక్నీషియన్స్ కు ధన్యవాదాలు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ప్రమోషన్స్, సాంగ్స్ రిలీజ్ త్వరలోనే మొదలుపెడతాము అని ట్వీట్ చేశాడు.

Trivikram : బన్నీతో త్రివిక్రమ్ సినిమా అనౌన్స్.. నిరాశలో మహేష్ ఫ్యాన్స్..

దీంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో హిట్స్ కొట్టి ఫామ్ లో ఉన్నారు. భోళాశంకర్ తో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధిస్తారని అంటున్నారు అభిమానులు.