అల్లు శిరీష్ – ఎబిసీడీ ఫస్ట్ సాంగ్ రిలీజ్

ఏబీసీడీ- ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : February 21, 2019 / 04:54 AM IST
అల్లు శిరీష్ – ఎబిసీడీ ఫస్ట్ సాంగ్ రిలీజ్

ఏబీసీడీ- ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్..

అల్లు శిరీష్, కృష్ణార్జున యుద్ధం ఫేమ్, రుక్సార్ థిల్లాన్ జంటగా, సంజీవ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ప్రముఖ దర్శక, నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, పెళ్ళి చూపులు ఫేమ్, యష్ రంగినేని కలిసి నిర్మిస్తుండగా, డి.సురేష్ బాబు సమర్పిస్తున్న సినిమా, ఏబీసీడీ.. (అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ) అనేది ట్యాగ్ లైన్.. ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా ఎబిసీడీ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే.. అనే బ్యూటీఫుల్ మెలోడి వినడానికి చాలా బాగుంది.
జుదా శాండీ ట్యూన్‌కి, కృష్ణకాంత్ చక్కటి పదాలు రాయగా, సిడ్ శ్రీరామ్ చాలా బాగా పాడాడు. అతనితో అదితి భవరాజు కూడా గొంతు కలిపింది. లవర్స్ మధ్య ఫీలింగ్స్‌ని పాట రూపంలో చాలా చక్కగా చెప్పారు.

రిచ్ కిడ్ అయిన ఒక కుర్రాడికి, ఇండియాలో పేదవాడిగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తే ఏం చేసాడు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? అనే పాయింట్‌తో మలయాళంలో తెరకెక్కిన ఏబీసీడీ మూవీని, అదే పేరుతో తెలుగులో అఫీషియల్‌గా రీమేక్ చేస్తున్నారు..  హీరోగా నిలదొక్కుకోవడానికి నానా తంటాలూ పడుతున్న శిరీష్, ఈ సినిమా తనకి బ్రేక్ ఇస్తుందనే హోప్‌తో ఉన్నాడు. మార్చి 1 న సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం : జుదా శాండీ, కెమెరా : రామ్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : వర్మ, కొరియోగ్రఫీ : విజయ్ మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ధీరజ్ మెగిలినేని.

వాచ్ లిరికల్ సాంగ్…