జూన్ 21 న మెంటల్ హై క్యా

  • Publish Date - April 17, 2019 / 08:01 AM IST

రాజ్‌కుమార్ రావు, కంగనా రనౌత్ జంటగా, సైజ్ జీరో ఫేమ్ ప్రకాష్ కోవెలమూడి (కె.రాఘవేంద్రరావు తనయుడు) దర్శకత్వంలో, శోభా కపూర్, ఏక్తా కపూర్ అండ్ శైలేష్ ఆర్ సింగ్ నిర్మిస్తున్న సినిమా, మెంటల్ హై క్యా .. క్వీన్ మూవీ తర్వాత రాజ్‌కుమార్ రావు, కంగనా కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.. రీసెంట్‌గా మెంటల్ హై క్యా మూవీని జూన్ 21 న రిలీజ్ చెయ్యబోతున్నట్టు అనౌన్స్ చేస్తూ, న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

పోస్టర్‌లో రాజ్‌కుమార్ రావు, కంగనా రనౌత్ ఇద్దరూ.. నాలుక చాపి, పదునైన బ్లేడుని నాలుకపై పెట్టుకుని ఉన్నారు. ఈ పోస్టర్ చూడ్డానికి ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది.. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న మెంటల్ హై క్యా చిత్రానికి రచన : కనికా థిల్లాన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : రుచికా కపూర్.