Mirai director Karthik Ghattamaneni to work on Chiranjeevi's next film
Chiru-Karthik: మిరాయ్ సినిమాతో యావత్ సినీ ఇండస్ట్రీని షేక్ చేశాడు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో, మొదటి రోజు రూ.27 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ సినిమా రెండు రోజుల్లో ఏకంగా రూ.55 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేశారు. అయితే, ఈ మొత్తం విజయంలో ప్రధాన పాత్ర అనే దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని(Chiru-Karthik) అనే చెప్పాలి. తాను అనుకున్న కథను అంతే క్వాలిటీతో స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు.
OG: ఓజీ నుంచి నెక్స్ట్ సాంగ్ అప్డేట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న పోస్టర్
కేవలం రూ.60 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ను అందించడంతో ఆయనపై ఇండియా లెవల్లో ప్రశంసలు కురుస్తున్నాయి. నిజానికి, మిరాయ్ సినిమాకు కార్తిక్ ఘట్టమనేని కేవలం దర్శకుడిగా మాత్రమే కాదు కెమెరామెన్ గ కూడా పని చేశారు. తన అద్భుతమైన కెమెరా పనితనంతో సినిమాను నెక్స్ట్ లెవల్లో ప్రెజెంట్ చేశాడు. ఆ విషయంలో ఆయన వందకి వెయ్యి వర్కులను అందుకున్నాడు. ఇంతకు ముందే చాలా సినిమాలకు కెమెరామెన్ గా వర్క్ చేశాడు కార్తీక్ ఘట్టమనేని. అదే క్రమంలో ఇప్పుడు ఆయనకు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది.
అదేంటంటే, మెగాస్టార్ చిరంజీవితో వర్క్ చేసే అవకాశం. అవును.. మెగాస్టార్ దర్శకుడు బాబీ కొల్లితో ఓ సినిమా ఓకే చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కాంబోలో వాల్తేరు వీరయ్య అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో ఆడియన్స్ ను అలరించడానికి వస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చింది. అయితే, ఈ సినిమాకు కెమెరామెన్ గా కార్తీక్ ఘట్టమనేనిని ఫిక్స్ చేశారట మేకర్స్. బాబీ అనుకున్న కథను కార్తీక్ అయితేనే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని ప్లాన్ చేశారట. అలా మెగాస్టార్ చిరంజీవితో వర్క్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు ఈ కుర్ర దర్శకుడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.