Mirai Movie : ‘మిరాయ్‌’ మూవీలో అతిధి పాత్రలో ప్రభాస్..? చిత్ర హీరో తేజ సజ్జా ట్వీట్ వైరల్.. ఫ్యాన్స్‌కు పండగే..

Mirai Movie : తేజ సజ్జా హీరోగా నటించిన ‘మిరాయ్’ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mirai movie

Mirai Movie : తేజ సజ్జా హీరోగా రాబోతున్న తాజా చిత్రం ‘మిరాయ్’. ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 12న (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ ఈగల్ సినిమాతో ఆకట్టుకున్న కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ సినిమాను తెరకెక్కించారు. రుతిక ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా.. మంచు మనోజ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. అదేవిధంగా శ్రియా శరణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. భారీ తారాగణం నటించిన ఈ సినిమాకు సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. మిరాయ్ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ అతిథిపాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇదే విషయంపై ట్విటర్‌లో సినిమా హీరో తేజ సజ్జా కీలక విషయాన్ని వెల్లడించారు.

Also Read: Kantara Chapter 1: కేరళలో కాంతార 1 విడుదలపై నిషేధం.. కారణం ఏంటంటే?

మిరాయ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న వేళ గురువారం రాత్రి ఆ సినిమా హీరో తేజ సజ్జా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్‌లో సినిమాకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ‘మిరాయ్ సినిమా కొన్ని గంటల్లో మీ ముందుకొస్తుంది. ఈ సినిమాను ఇంత ప్రత్యేకంగా చేసినందుకు రెబల్ స్టార్ ప్రభాస్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆయన ఈ సినిమాను మరింత స్పెషల్ గా చేశారు. మీరు మాత్రం రెబలియస్ సర్ప్రైజ్ ను మొదటి నుంచి మిస్ అవ్వొద్దు’ అని తేజ సజ్జా రాసుకొచ్చారు.


తేజ సజ్జా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన ట్వీట్ ప్రకారం.. మిరాయ్ సినిమాలో ప్రభాస్ అతిథిపాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. అయితే, ప్రభాస్ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తాడా..? లేదంటే ఈ సినిమాలో వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడా..? అనే విషయం ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేపుతోంది.